జ్యోతిష్యం:జులై 16 నుంచి ఐదు రాశుల వారి జీవితం మారిపోతుంది.. అసలు కారణం ఇదే..!

గ్రహాల రాజైన సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యదేవుడు ప్రస్తుతం మిథునరాశిలో ఉన్నాడు. జూలై 16 రాత్రి 11:44 గంటలకు సూర్యుడు మిథున రాశిని విడిచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 17 వరకు అక్కడే సంచరిస్తాడు. దీని ప్రభావంతో ఐదు రాశుల వారి జీవితం పూర్తిగా మారుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .
వృషభ రాశి: సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం వలన ఈ రాశి వారికి గతంలో నిలిచి పోయిన పనుల్లో వేగం పుంజుకుంటుంది. వీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలవైపు దృష్టి సారించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సమాజంలో గౌరవం మరింత పెరిగే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు ఆఫీసులో కొత్త బాధ్యతలు, ప్రమోషన్లు దక్కే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి క్రమంగా లాభాలు పెరుగుతాయి, వ్యాపార విస్తరణకు అడుగులు పడతాయి. వాహనయోగం కలుగుతుంది. నిరుద్యోగులు జాబ్ ఆఫర్లు అందుకుంటారుని పండితులు చెబుతున్నారు.
మిథున రాశి: కర్కాటకరాశిలో సూర్యుడు సంచారం వలన ఈ రాశివారికి కొత్త ఆదాయ మార్టాలు ఏర్పడుతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి బాధ్యతలు పెరగడంతోపాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకుంటారు. గతంలో చేసిన కష్టానికి.. పాత పెట్టుబడులకు ఇప్పుడు ప్రతిఫలం అందుకుంటారు.ఆర్థికంగా స్థిరపడటానికి ఇది చాలా మంచి సమయమని పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి: ఇదేరాశిలో సూర్యుడి సంచారం వలన ఆత్మవిశ్వాశం రెట్టింపు అవుతుంది. కొత్త ప్రాజెక్ట్ లు చేపట్టి విజయం సాధిస్తారు. టీమ్ లీడర్ గా చక్కని అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరగడానికి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు.. మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగంతో పాటు.. మంచి జీతం కూడా వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి. వ్యాపారస్తులు అనుకోకుండా కొత్త వెంచర్ ను ప్రారంభిస్తారు. ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కన్యా రాశి: కర్కాటక రాశిలో సూర్యుడి సంచారం… ఈ రాశి వారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. కెరీర్ కు సంబంధించి మార్పులు చోటుచేసుకుంటాయి. ఎలాంటి పనులు తలపెట్టినా విజయం సాధిస్తారు. చిన్న చిన్న ప్రయాణాలుంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.. పాత బాకీలు వసూలు కావడంతో పాటు ధన ప్రవాహం పెరుగుతుందనే సంకేతాలు ఉన్నాయి. ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు వ్యాపారాలు చేయాలనుకునేవారు మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు.
మకర రాశి: కర్కాటక రాశిలోకి సూర్య గ్రహ సంచారం వలన అన్ని మంచి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్ద ప్రణాళికల్లో విజయం సాధిస్తారు. పని విస్తరిస్తుంది. అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కెరీర్‌కు సంబంధించిన శుభవార్తలను అందుకోవచ్చు. కొత్త ఉద్యోగం పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు మీ కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. మీ దృష్టి పనిపై ఉంటుంది, ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. సీనియర్లు మరియు జూనియర్లు అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం