నాలుగేళ్లుగా బిగ్ బాస్‌కు ట్రై చేస్తున్నా.. రెండు సార్లు రిజెక్ట్ చేశారు.. నాలాంటి వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలి..

బిగ్ బాస్ సీజన్ 10 కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ అనేది ఓ క్రేజీ గేమ్ షో.. ఈ షో ద్వారా పాపులర్ అవ్వాలని కొంతమంది, డబ్బు సంపాదించాలని మరికొంతమంది, సినిమాల్లో, సీరియల్స్ లో అవకాశాలు అందుకోవాలని ఇంకొంతమంది ట్రై చేస్తుంటారు. సినీ సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొని ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతే కాదు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన చాలా మంది ఇప్పుడు బిజీగా గడుపుతున్నారు. కొంతమంది సినిమాల్లో నటిస్తుంటే మరికొంతమంది టీవీ షోలు, సోషల్ మీడియాలో బిజీగా మారిపోయారు. దాంతో చాలా మంది బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు. మరి ఈసారి ఎవరెవరు హౌస్ లోకి అడుగుపెడ్తారో చూడాలి.
ఇది కూడా చదవండి : జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ నటి
ఇదిలా ఉంటే ఓ నటి దాదాపు నాలుగేళ్లుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని ప్రయతినిస్తుందట.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని నాలుగైదేళ్లుగా ట్రై చేస్తున్నా అని ఆమె స్వయంగా చెప్పింది. బిగ్ బాస్‌లోకి వెళ్లాలని ట్రై చేస్తున్నా అని తెలిపింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మరెవరో కాదు అందాల నటి రేఖ భోజ్. మాంగల్యం అనే సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది రేఖ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలో నటనకు మించిన ప్రాధాన్యత మరేదానికీ లేదని అన్నారు.
ఇది కూడా చదవండి : ఆమెకు19 ఆయనకు 31..! 20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
బిగ్ బాస్ లోకి ప్రవేశించడానికి గత నాలుగు సంవత్సరాలుగా తాను ప్రయత్నిస్తున్నానని రేఖ భోజ్ తెలిపారు. గత ఏడాది రెండుసార్లు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చానని, చివరి నిమిషంలో అవకాశం చేజారిపోయిందని ఆమె అన్నారు. “బిగ్ బాస్ లోకి వచ్చే కొందరు కంటెస్టెంట్లను చూస్తే, అసలు వీరు ఎవరబ్బా.?, ఎలాంటి పారామీటర్స్ తో వచ్చారు.? అని అనిపిస్తుంది. జనాలకు తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు,” అని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక అవకాశం వచ్చుంటే తాను దానిని ఎంతో బాగా ఉపయోగించుకునేదానినని ఆమె అన్నారు. మరోసారి కూడా వీడియో, పోర్ట్‌ఫోలియో బిగ్ బాస్ టీమ్‌కు పంపినా ప్రయోజనం లేకపోయిందని ఆమె తెలిపారు.
ఇది కూడా చదవండి : చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు
View this post on Instagram
A post shared by Rekha Boj Official ( Kurakula Sri Sushma ) (@reekhabojofficial)
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి