July 14, 2026

కొత్తవారం భారీగా తగ్గిన గోల్డ్.. తులం రూ.14 వందలు దిగొచ్చిన ధర

కొత్తవారం భారీగా తగ్గిన గోల్డ్.. తులం రూ.14 వందలు దిగొచ్చిన ధర
Reading Time: < 1 minute

కొత్తవారం భారీగా తగ్గిన గోల్డ్.. తులం రూ.14 వందలు దిగొచ్చిన ధర

Caption of Image.

అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మళ్లీ గ్లోబల్ మార్కెట్లతో పాటు బులియన్ మార్కెట్లను అతలాకుతలం చేసేస్తున్నాయి. దీంతో కొత్తవారం ప్రారంభంలోనే బంగారం రేట్లు భారీగా దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు షాపింగ్ చేయాలి అనుకుంటే ముందుగా తమ ప్రాంతంలోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం బెటర్.

జూలై 13న బంగారం రేట్లు తగ్గాయి. జూలై 12 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.142 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 291గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 100గా కొనసాగుతోంది. 

సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూలై 11, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 40వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.240 దగ్గర ఉంది. 

©️ VIL Media Pvt Ltd.