July 13, 2026

Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?

Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
Reading Time: < 1 minute
Akhils Lenin Box Office Solid Weekend Run Crucial Weekday Test Begins

అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 10న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూదూసుకెళ్తూ గత కొన్ని రోజులుగా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హౌస్‌ఫుల్ బోర్డులతో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా వీకెండ్ శని, ఆదివారాలు హాలిడేస్ అడ్వాంటేజ్‌ను ఈ చిత్రం వందకు వంద శాతం వాడుకుని థియేటర్లలో దుమ్ము లేపేసింది.

అఖిల్ మాస్ మేకోవర్, భాగ్యశ్రీ గ్లామర్, మరియు మురళీ కిషోర్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను థియేటర్లకు భారీగా రప్పించాయి. వీకెండ్ వరకు వసూళ్ల పరంగా ఎలాంటి ఢోకా లేకుండా సాగిన ‘లెనిన్’ ప్రయాణం, ఈ రోజు సోమవారం చాలా కీలకం. ఏ సినిమాకైనా మొదటి వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం అనేది అత్యంత కీలకం. ఈ వర్కింగ్ డే నుంచి సినిమాకు అసలైన అగ్నిపరీక్ష మొదలవుతుంది. సాధారణంగా వీకెండ్ సెలవులు ముగిసి సోమవారం వర్కింగ్ డే కావడంతో థియేటర్లలో సాధారణ ప్రేక్షకుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. సోమవారం స్టడీగా కలెక్షన్స్ రాబట్టగలితే ఆ సినిమాలకు లాంగ్ రన్ ఉంటుంది. ఇప్పుడు ‘లెనిన్’ ఆ టెస్ట్ ను ఎదుర్కోబోతుంది. ఈ రోజు వసూళ్లలో కూడా కొంత మేర డ్రాప్ కనిపించే ఛాన్స్ ఉంది కానీ ఎంత అనే దానిపై ఈ సినిమా రన్ ఆధారపడి ఉంటుంది. ఈ వర్కింగ్ డేస్ లో కూడా సినిమా గనక స్టెడీగా నిలబడి, డ్రాప్స్ పెద్దగా లేకుండా మేనేజ్ చేయగలిగితే మాత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ లాంగ్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.