July 13, 2026

ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని

ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని
Reading Time: 2 minutes
ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని

పోసాని కృష్ణమురళి తన సినీ పరిశ్రమ ప్రస్థానాన్ని, వ్యక్తిగత విజయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. డాక్టరేట్ పూర్తిచేసే దశలో ఉండగా, దర్శకుడు మోహన్ గాంధీ గుర్తించి, బలవంతంగా రచయితగా మార్చారని తెలిపారు పోసాని. “చదువుకున్నావు కదా, పెళ్లి చేసుకోవాలి, జీవితంలో స్థిరపడాలి” అని ప్రోత్సహించి, తన దగ్గరే ఆఫీసులో ఉండమని, పైకి వచ్చేదాకా సహాయపడతానని మోహన్ గాంధీ హామీ ఇచ్చినట్లు పోసాని గుర్తుచేసుకున్నారు. పోలీస్ బ్రదర్స్ వంటి మొదటి సినిమా విజయం తన కెరీర్‌కు పునాది వేసిందని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. తాను రోజుకు 18 నుంచి 19 గంటలు పని చేసేవాడినని, కేవలం మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవాడినని తెలిపారు. ఉదయం నాలుగు గంటలకే లేచి వాకింగ్ వెళ్లే అలవాటు ఉండేదని చెప్పారు. తన బాల్యం గురించి చెబుతూ, రూ .7 రూపాయల కోసం ముళ్ళున్న చెక్కలతో బుట్టలు అల్లిన రోజుల నుంచి వచ్చానని గుర్తుచేసుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో అసిస్టెంట్లకు డబ్బులు ఇవ్వని రోజుల్లో, పోసాని కృష్ణమురళి మాత్రం తన అసిస్టెంట్లకు నెలకు రూ.2000-రూ.3000 ఇచ్చేవారని, ఈ విషయంలో ఆయన ప్రత్యేకతను చాటుకున్నారు.

ఇది కూడా చదవండి : జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ నటి

పోసాని వద్ద పనిచేసిన పలువురు అసిస్టెంట్లు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకులుగా, రచయితలుగా ఎదిగారు. ఆకుల శివ, కొరటాల శివ, సంపత్ నంది, డివిఎస్ రవి వంటి సుమారు 30 మంది పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేసిన వారే అని పేర్కొన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం తన వద్ద అసిస్టెంట్‌గా చేరడానికి పట్టుబట్టిన విషయాన్ని పంచుకున్నారు. త్రివిక్రమ్, తనకు పోసాని అంటే అభిమానమని చెప్పి రెండు, మూడు నెలలు పోసాని ఇంటి చుట్టూ తిరిగారని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గౌతమ్ రాజు అనే కమెడియన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు రూ.1000 అప్పుగా ఇచ్చి మద్రాసుకు పంపినట్లు తెలిపారు. గౌతమ్ రాజు తన చేతి బ్రాస్లెట్ తాకట్టుపెట్టి త్రివిక్రమ్ ను మద్రాసులో ఉన్న తన దగ్గరకు పంపించాడని పోసాని తెలిపారు. పోసాని కృష్ణమురళి తన వద్దకు వచ్చిన వారి ప్రతిభను చూడకుండా, వారికి అవకాశమిచ్చేవారని, తాను ఏనాడూ ఎవరినీ పని చేయమని ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : ఆమెకు19 ఆయనకు 31..! 20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్

తన నిజాయితీ, కష్టపడే స్వభావం గురించి మాట్లాడుతూ, ఇతరులు తనను పొగిడినా, విమర్శించినా పట్టించుకోనని చెప్పారు. తాను మంచివాడినా, పద్ధతిగా ఉంటున్నానా లేదా అని మాత్రమే చూసుకుంటానని తెలిపారు. “నేను చెడ్డ పనులు, అవినీతి, పైరవీలు చేయనప్పుడు నేను బాధపడాల్సిన అవసరం లేదు” అని ధీమాగా చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమ తనకు, తన కుటుంబానికి ఎన్నో ఇచ్చిందని, వంద కోట్లకు పైగా ఆస్తులను సమకూర్చిందని కృష్ణమురళి పేర్కొన్నారు. ఇది తన తెలివితేటలు కాదని, నిజాయితీ కాదని, కేవలం తన కష్టపడే తత్వమే అని అన్నారు కృష్ణ మురళి.

ఇది కూడా చదవండి : చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు

Gautham Raju

 మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి