July 14, 2026

Vijay Deverakonda: అన్నా.. నువ్వే ఆదుకోవాలి..! అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..

Vijay Deverakonda: అన్నా.. నువ్వే ఆదుకోవాలి..! అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
Reading Time: 2 minutes
Vijay Deverakonda: అన్నా.. నువ్వే ఆదుకోవాలి..! అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా విపరీతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు విజయ్. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ స్టార్ హీరో ఆ తర్వాత హీరోగా మారి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. పెళ్లి చూపులతో మొదలుపెట్టి అర్జున్ రెడ్డితో సెన్సేషనల్ హిట్ అందుకొని ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు విజయ్. కేవలం హీరోగానే కాదు సామాజిక సేవలోనూ విజయ్ ముందుంటాడు. ఇప్పటికే ఎన్నో సేవ కార్యక్రమాలు చేశాడు ఈ రౌడీ స్టార్.

ఇది కూడా చదవండి : జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ నటి

ఇటీవలే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నాను పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన విజయ్ పెళ్లి తర్వాత అచ్చం పేట డివిజన్ లో ఉన్న 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి విద్యార్థులకు విజయ్ దేవరకొండ ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున స్కాలర్ షిప్స్ అందిస్తున్నారు. ఇదే కాదు ఇలాంటి మరెన్నో సేవ కార్యక్రమాలు చేశాడు విజయ్. అలాగే తన అభిమానుల కోరికలు కూడా తీరుస్తుంటాడు ఈ క్రేజీ హీరో.. తాజాగా విజయ్ తన అభిమాని కన్నీళ్లకు చలించిపోయాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి : ఆమెకు19 ఆయనకు 31..! 20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్

తాజాగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన టీజీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్‌ వీక్షించడానికి వచ్చాడు స్టార్ విజయ్ దేవరకొండ. అక్కడ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. టోర్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా టీజీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్‌ కు వచ్చిన విజయ్‌ను చూసి ఓ అభిమాని ఎమోషనల్ అయ్యాడు. విజయ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. విజయ్ ను దగ్గర నుంచి చూడగానే భోరున ఏడ్చేశాడు ఆ ఫ్యాన్. దాంతో విజయ్ అతన్ని దగ్గరకు తీసుకున్నాడు. ఆతర్వాత ఆ అభిమాని.. నేను క్రికెట్ బాగా ఆడతాను అన్నా.. కానీ నాకు సరైన ప్రోత్సాహం, సపోర్ట్ లేదు.. నువ్వే నన్ను కొంచెం ఆదుకోవాలి అన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతని కన్నీళ్లకు విజయ్ కరిగిపోయాడు.. అతన్ని గట్టిగా గుండెలకు హత్తుకుని ఓదార్చాడు విజయ్. అలాగే అతని కుటుంబ వివరాలు అడిగి తెలుసుకొని అతని మద్దతుగా ఉంటాను అంటూ భరోసా ఇచ్చాడు విజయ్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి : చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి