July 14, 2026

Maa Inti Bangaram OTT: 100 కోట్ల క్లబ్‌లో ‘మా ఇంటి బంగారం’.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

Maa Inti Bangaram OTT: 100 కోట్ల క్లబ్‌లో ‘మా ఇంటి బంగారం’.. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
Reading Time: 2 minutes
Samantha Maa Inti Bangaram Ott Release Date Confirmed Streaming On To Jiohotstar

Maa Inti Bangaram OTT: థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి ‘మా ఇంటి బంగారం’ మూవీకి విశేష ఆదరణ అందుకుంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్ల మైలురాయిని అధికారికంగా చేరుకుంది. ఈ సంబరాలు కొనసాగుతుండగానే చిత్రబృందం అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందించింది. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటిస్తూ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు కూడా సిద్ధమవుతోంది. ‘మా ఇంటి బంగారం’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం 2026 జూలై 17 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుందని ఆఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసింది. అయితే తొలి విడతలో తెలుగు వెర్షన్‌ను మాత్రమే విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే ఇతర భాషల వెర్షన్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే ఈ సినిమాను వీక్షించే అవకాశం పొందనున్నారు.

సమంత తన సొంత నిర్మాణ సంస్థ త్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై దీనిని నిర్మించగా, దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా రూపొందించిన సన్నివేశాలు సినిమాకు మంచి స్పందన తీసుకొచ్చాయి. ప్రస్తుతం సినిమా ఇంకా కొన్ని ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుండగానే ఓటీటీ విడుదల తేదీ ప్రకటించడంతో ఈ బ్లాక్ బస్టర్ ను చూసేందుకు అభిమానులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో రూ.100 కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకున్న ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు డిజిటల్ వేదికపై కూడా అదే స్థాయి ఆదరణను అందుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. సమంత కెరీర్‌లో నటిగా, నిర్మాతగా ఈ చిత్రం ఒక కీలక మైలురాయిగా నిలిచిన నేపథ్యంలో, జూలై 17 నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ సినిమా ఎంతటి వ్యూయర్‌షిప్ నమోదు చేస్తుందో చూడాల్సి ఉంది.