Horoscope Today (July 13, 2026): మేషం రాశి వారికి శుభ గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారు ప్రస్తుతం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృషభం రాశివారికి లాభ స్థానంలో శని సంచారం కారణంగా ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ లాభసాటిగా సాగిపోతాయి. మిథునం రాశి వారికి శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. మేషం నుంచి మీనం వరకు ఏ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం పరంగా సోమవారం మీ రాశి ఫలితాలను తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): శుభ గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారు ప్రస్తుతం ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యో గంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మంచి గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. తక్కువ శ్రమతో అత్యధికంగా ఆర్థిక లాభం పొందుతారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): లాభ స్థానంలో శని సంచారం కారణంగా ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయంతో పాటు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడ తాయి. బంధుమిత్రుల వల్ల కీలక పనులు సానుకూలపడతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయ త్నంతో చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సానుకూలం అవుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలే కాకుండా వ్యాపారాలు కూడా ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి. కీలక విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ఆశించిన స్థాయిలో లాభపడతారు. కొత్త ప్రయత్నాలకు అవరోధాలు తొలగుతాయి. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఆదాయంలో పెరుగుదల, మెరుగుదల ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. మితిమీరిన ఔదార్యంతో కొందరికి సహాయం చేసి ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగి తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి, మంచి ఫలి తాలు సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రవి, కుజులు చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగి కొద్దిగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. మీ సలహాలు, సూచనలకు విలువ ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగావకాశాలు అందివస్తాయి. విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా పురోగమిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇంటా బయటా ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల చదువుల మీద బాగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. జీవిత భాగస్వామి ద్వారా చిన్నపాటి అదృష్టం పడుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరగడం, మంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): గురు బలం వల్ల ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన పనుల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. బంధువులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి సహాయ సహకారాలందుతాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. జీవిత భాగ స్వామితో అన్యోన్యత పెరుగుతుంది. అనుకోకుండా వ్యక్తిగత, ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): కుజ, రవి గ్రహాల అనుకూలత వల్ల, రాశినాథుడు గురువుకు బలం పెరగడం వల్ల శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పెద్దల జోక్యంతో సాను కూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్య అవకాశాలున్నాయి. ఆదాయంతో పాటు కుటుంబ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): బుధ, గురు, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగు తుంది. ఉద్యోగంలో అధికారులతో వ్యవహారాలన్నీ సామరస్యంగా సాగిపోతాయి. ఇష్టమైన బంధు మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆదాయ వృద్ధితో పాటు ఆకస్మిక థన లాభ సూచనలున్నాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): శుక్ర, రవి, బుధ గ్రహాల బలం అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను, సహోద్యోగులను పని తీరుతో ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో యాత్ర చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త అందుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు పంచమంలో ఉచ్ఛస్థితిలో ఉన్నందువల్ల ప్రతిదీ అనుకూలంగా సాగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అవసరానికి మించి ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఇంటా బయటా శ్రమ, తిప్పట ఉంటాయి. ధన వృద్ధికి సమయం అనుకూలంగా ఉంది.