Reading Time: < 1 minute
Gold Prices: మళ్లీ దిగొచ్చిన బంగారం ధరలు.. వారం ప్రారంభంలోనే బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గత వారంలో ధరలు భారీగా పెరగ్గా.. ఈ వారం ప్రారంభంలో పడిపోయాయి. దీంతో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది పెద్ద ఊరటగా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా పరిణామాల క్రమంలో పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచనుందనే వార్తల క్రమంలో గోల్డ్ ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నేాయి. ప్రస్తుుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

నేటి బంగారం ధరలు ఇవే..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,320 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,32,900గా ఉంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,44,320 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,900 వద్ద కొనసాగుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,45,080గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,32,990 వద్ద కొనసాగుతోంది.

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,320 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,32,290కు లభిస్తోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,44,470 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,32,440 వద్ద కొనసాగుతోంది.

-ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,44,320 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,32,290 పలుకుతోంది

వెండి ధరలు ఇలా..

-ముంబైలో కిలో వెండి ధర రూ.2,34,900 పలుకుతోంది

-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2,34,900గా ఉంది

-హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.2,39,900గా కొనసాగుతోంది

-చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,39,900 వద్ద ట్రేడవుతోంది.

-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,34,900గా ఉంది