Reading Time: < 1 minute
Kollywood Star Hero Dhanush Political Entry Father Kasthuri Raja Comments

తమిళ రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతుందా? విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్లే మరో హీరో రాజకీయాల్లోకి రాబోతున్నారా? అది కూడా విజయ్‌కు పోటీగా పాలిటిక్స్ లోకి వస్తారా? అటు కోలీవుడ్‌లో, అరవ రాజకీయాల్లో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన కుమారుడు ధనుష్ రాజకీయాలకు రావచ్చంటూ సీనియర్ డైరెక్టర్ కస్తూరి రాజా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారంటూ టాక్ నడుస్తోంది. తమిళనాడులో సినీ రంగానికి, రాజకీయాలకు దశాబ్దాల కాలంగా విడదీయరాని బంధం ఉంది. ఎమ్జీఆర్, జయలలిత నుంచి నిన్నటి విజయ్ వరకు ఎంతోమంది సినీతారలు రాజకీయాల్లోకి వచ్చి నాయకులుగా రాణించారు, సీఎంలు అయ్యారు.

ఇలాంటి పరిస్థితుల్లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇదే విషయంపై ధనుష్ తండ్రి, సీనియర్ డైరెక్టర్ కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కస్తూరి రాజా, ధనుష్ పొలిటికల్ ఎంట్రీ పై కామెంట్స్ చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరికైనా ఆ హక్కు ఉంటుందన్నారు. కస్తూరి రాజా వ్యాఖ్యలతో ధనుష్ రాజకీయాల్లోకి రావడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది.