Reading Time: 2 minutes
Dk Shivakumar Swearing In Today As Karnataka Cm Full List Of Ministers Taking Oath

DK Shivakumar Swearing as Karnataka CM: కర్ణాటక రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK. Shivakumar) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్‌ గ్లాస్ హౌస్ లో సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమంl డీకే శివకుమార్‌తో పాటు 10 మందికి పైగా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

కొత్త ప్రభుత్వంలో జి. పరమేశ్వర (G. Parameshwara) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే మంత్రి మండలి కూర్పుపై చర్చలు పూర్తయ్యాయని సమాచారం. నేడు ఉదయం 10 గంటలకు తానే స్వయంగా మంత్రివర్గ జాబితాను ప్రకటిస్తానని డీకే శివకుమార్ ఇప్పటికే వెల్లడించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం లోక్ భవన్‌లో సుమారు 4,000 మందికి పైగా కూర్చునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేశారు. కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో LED స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ లు హాజరుకానున్నారు. అలాగే తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు. మొత్తం 35 మంది VVIPలకు ఆహ్వానాలు అందించినట్లు సమాచారం. మాజీ ప్రధాని దేవే గౌడ, మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, బసవరాజ్ బొమ్మై, జగదీష్ షెట్టర్, వీరప్ప మొయిలీ లకు కూడా డీకే స్వయంగా ఆహ్వానాలు పంపించారు.

ముఖ్యమంత్రి పదవిని చేపట్టే ముందు డీకే శివకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు బెంగళూరులోని అజ్జయ్య మఠంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే నేడు ఉదయం కూడా పలు దేవాలయాల్లో దర్శనాలు చేసుకుని ఆశీర్వాదాలు పొందారు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. నేడు ప్రమాణ స్వీకారం చేసే వారిలో యతీంద్ర సిద్ధరామయ్య, డాక్టర్ జి. పరమేశ్వర, యు.టి. ఖాదర్, కె.జె. జార్జ్, కృష్ణ బైరే గౌడ, ఎం.బి. పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కె.హెచ్. మునియప్ప, దినేష్ గుండూ రావు తదితరులు ఉన్నారు.