July 14, 2026

కేరళలోని ‘ట్విన్ టౌన్’.. ఇక్కడ అంతా డబుల్ ధమాకా.. ఎటు చూసినా కవలలే !

కేరళలోని  'ట్విన్ టౌన్'.. ఇక్కడ అంతా డబుల్ ధమాకా.. ఎటు చూసినా కవలలే !
Reading Time: 2 minutes

కేరళలోని ‘ట్విన్ టౌన్’.. ఇక్కడ అంతా డబుల్ ధమాకా.. ఎటు చూసినా కవలలే !

Caption of Image.

కేరళలోని మలప్పురం జిల్లాలో ఉన్న కోడిన్హి అనే చిన్న గ్రామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మొదటిసారి ఈ ఊరికి వెళ్తే ఏదో సాధారణ గ్రామంలాగే అనిపిస్తుంది కానీ, కాసేపు గమనిస్తే చాలు.. ఎటు చూసినా ఒకేలా ఉన్న ముఖాలు, జంటగా తిరిగే పిల్లలు కనిపిస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తారు. అందుకే ఈ ఊరిని “ఇండియాస్ ట్విన్ టౌన్” అని పిలుస్తారు.

ఎందుకు వార్తల్లో నిలిచిందంటే 
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart), ఈ ఊరి ప్రత్యేకతను వాడుకుంటూ ఒక కొత్త ప్రకటన (Add) విడుదల చేసింది. “రెట్టింపు లాభం, రెట్టింపు ఆఫర్లు” అనే కాన్సెప్ట్‌ను చెప్పడానికి, అంతా కవలలే ఉండే ఈ ఊరిని ఉదాహరణగా చూపించడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.

అసలు  కోడిన్హి గ్రామంలోని వింతను ఈ లెక్కలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఊరిలో సుమారు 2 వేల కుటుంబాలు ఉంటే, అందులో 400 నుండి 550 జంటల కవలలు ఉన్నారు. సాధారణంగా ఇండియాలో ప్రతి వెయ్యి మంది పిల్లల జననాల్లో 4 నుండి 9 మంది కవలలు పుడతారు. కానీ ఈ ఊరిలో 45 వరకు ఉంది. గత 60-70 ఏళ్లుగా ఈ ట్రెండ్  కొనసాగుతూనే ఉంది.

మరో వింత ఏమిటంటే, ఈ ఊరి ఆడపిల్లలు వేరే ప్రాంతాల వారికి ఇచ్చి పెళ్లి చేసినా, అక్కడ కూడా వారు కవలలకే జన్మనివ్వడం విశేషం. అంటే ఇలా కేవలం ఆ ఊరి వాతావరణం వల్ల మాత్రమే కాదు, జన్యుపరంగా ఏదో రహస్యం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

►ALSO READ | విజయ్ కార్లకు ఒకే నంబర్.. ‘0277’ వెనుక ఉన్న ఎమోషనల్ స్టోరీ ఇదే..

సైన్స్‌కు అందని రహస్యం
దేశ విదేశాల నుంచి ఎంతో మంది శాస్త్రవేత్తలు వచ్చి పరిశోధనలు చేసినా, దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. అక్కడి వారు తాగే నీరు లేదా తినే ఆహారం వల్ల ఇలా జరుగుతుందేమో అని పరీక్షించారు, కానీ ఏమీ తేలలేదు. కవలలు పుట్టడానికి కారణమయ్యే ప్రత్యేక జన్యువుల కోసం వెతికారు, అక్కడ కూడా స్పష్టమైన ఆధారం దొరకలేదు. స్థానికులు మాత్రం ఇదంతా ఆ దేవుడి మహిమ అని నమ్ముతారు.

కవలల కోసం ఒక సంఘం
వాళ్ళ  గ్రామానికి ఉన్న ఈ ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవడానికి స్థానికులు ‘ట్విన్స్ అండ్ కిన్స్ అసోసియేషన్’ (TAKA) అనే ఒక గ్రూపును కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీరు కవల పిల్లల కుటుంబాలకు అండగా ఉండటమే కాకుండా, పరిశోధనలకు కూడా సహకరిస్తుంటారు. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన రహస్యం కోడిన్హిని ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా నిలబెట్టింది.

 

©️ VIL Media Pvt Ltd.