Reading Time: 2 minutes

ఆధ్యాత్మికం:పూజసమయంలో దీపారాధన కొండెక్కితే ఆరిపోతే ఎలాంటి సంకేతం..అప్పుడు ఏంచేయాలి.. ఏ మంత్రం చదవాలి

Caption of Image.

హిందువులు చాలామంది సాధారణంగా ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే ఇలా నిత్య దీపారాధన చేసే సమయంలో కొందరు తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. . దీపారాధన ఎలా చేయాలి? ఎటువంటి నియమాలు పాటించాలి. ఒకవేళ పూజ చేసిన తరువాత అనుకోకుండా దీపం ఆరిపోతే ఏం చేయాలి? మళ్లీ వెలిగించవచ్చా వెలిగించకూడదా? ఇలాంటి ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి.‎ఈ విషయం గురించి ఆధ్యాత్మిక పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పూజ చేసే పమయంలో దీపం ఆరిపోతే ( కొండెక్కితే) ఆందోళనకు గురవుతారు.  దీనిని చాలమంది దుశ్శకునంగా భావిస్తారు.  అయితే  సనాతన ధర్మంలో, పూజ సమయంలో దీపం వెలిగించడం ఒక సంప్రదాయం. దీపారాధన లేకుండా పూజ చేయడం వలన  ఆ పూజ ప్రతి ఫలం దక్కదని శాస్త్రాలు చెబుతున్నాయి.  దీపం కాంతి.. జ్ఞానం..  సానుకూలతకు ప్రతీక అని పండితులు చెబుతున్నారు. 

పూజ సమయంలో దీపం వెలిగించడం వల్ల ఆర్థిక లాభం..  మానసిక ప్రశాంతత లభిస్తాయని పండితులు చెబుతున్నారు.  దీపారాధన కాంతి ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది.

పూజ సమయంలో దీపం ఆరిపోయినప్పుడు (కొండెక్కినప్పుడు) పనిలో ఆటంకాలు కలుగుతాయని భావిస్తుంటారు. అంతేకాకుండా, పూజ చేసేటప్పుడు మీ ఏకాగ్రత లోపిస్తుంది.  పూజ సమయంలో మనస్సును ఏకాగ్రతతో ఉంచుకోవడం చాలా ముఖ్యం అని అంటారు.  దీపం మసకగా వెలగడాన్ని ప్రతికూల శక్తికి లేదా వాస్తు దోషానికి సంకేతంగా భావిస్తారు.

పూజ చేస్తున్నప్పుడు దీపారాధన కొండెక్కితే  పూర్వీకులకు కోపం వస్తుందట. అందుకే  పూజ సమయంలో దీపారాధన విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని పండితులు చెపుతున్నారు. 

దీపారాధన కొండెక్కితే ఏం చేయాలి

పూజ సమయంలో మీ దీపం ఆరిపోతే  ఎలాంటి ఆందోళన చెందకుండా తెలియకుండా చేసిన పొరపాట్లకు ముందుగా దేవుడిని క్షమాపణలు అడగండి.  ఆ తర్వాత, దీపాన్ని మళ్ళీ వెలిగించండి. భగవంతుని ధ్యానించండి.  కుల దైవాన్ని… లేదా ఇష్ట దైవాన్ని ప్రార్థించండి.  “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని శ్రద్దగా ధ్యానం చేయండి జపించండి.

కర్పూరం వెలిగించండి

దీపం ఆరిపోయిన తర్వాత  ప్రతికూల ఆలోచనలు వస్తుంటే,  కర్పూరం వెలిగించండి. కర్పూరం సువాసన ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల శక్తిని కలుగజేస్తుంది

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.