July 14, 2026

Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Reading Time: < 1 minute
Hardik Pandya Missing Mi Travel Squad Rcb Clash Raipur

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద సస్పెన్స్ నడుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో వెన్నునొప్పి కారణంగా హార్దిక్ ఆడలేదు. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాయ్‌పూర్‌లో జరగబోయే తదుపరి మ్యాచ్‌కైనా అతను అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు. కానీ, బుధవారం ముంబై టీమ్ విమానాశ్రయం నుంచి బయలుదేరినప్పుడు హార్దిక్ అక్కడ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అతను తర్వాత టీమ్‌తో కలుస్తాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

ఫామ్‌లో లేని హార్దిక్..
ఈ సీజన్‌లో హార్దిక్ ఆటతీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. 8 మ్యాచ్‌ల్లో కేవలం 146 పరుగులు మాత్రమే చేశాడు. అటు బౌలింగ్‌లోనూ విఫలమయ్యాడు. దీంతో అతని గైర్హాజరీకి కేవలం గాయమే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. గత మ్యాచ్‌లో హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన మ్యాచ్ లకు కూడా హార్దిక్ దూరంగా ఉంటే.. . తదుపరి మ్యాచ్ లకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ముంబై టీం ముందుకు సాగనుంది.

ముంబై ఇండియన్స్ కష్టాలు..
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమైంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. అసలు ముంబైకి ఏమైంది? అనేది ఇప్పుడు అభిమానుల ప్రశ్న.

వైఫల్యానికి కారణాలు ఏంటి?
ముంబై జట్టు వైఫల్యానికి ప్రధాన కారణం నాయకత్వ మార్పు అని విశ్లేషకులు భావిస్తున్నారు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి, హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించడం జట్టులోని ఐక్యతను దెబ్బతీసినట్లు కనిపిస్తోంది. రోహిత్ శర్మ నాయకత్వంలో జట్టు ఎంతో నిలకడగా ఉండేది. కానీ హార్దిక్ కెప్టెన్ అయ్యాక, అటు ఆటగాడిగా ఇటు కెప్టెన్‌గా అతను ప్రభావం చూపలేకపోయాడు. క్లిష్ట సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలోనూ, బ్యాటింగ్ లేదా బౌలింగ్‌తో జట్టును గెలిపించడంలోనూ హార్దిక్ విఫలం కావడం ముంబైని కోలుకోలేని దెబ్బ తీసింది. మొత్తానికి ఈ సీజన్ ముంబై ఇండియన్స్‌కు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయేలా ఉంది.