Reading Time: 2 minutes
Nayanthara: నయనతార హ్యాపీగా జీవించాలంటే రోజుకి ఎంత కావాలంటే.?

నయనతార వంటి అగ్ర నాయికల జీవనశైలి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చలు జరుగుతుంటాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్ అవుతున్నాయి. నయనతార విలాసవంతమైన జీవితానికి రోజుకు ఎంత ఖర్చవుతుంది? ఆమె భర్త దీనిపై ఏమన్నారంటే..?

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘లేడీ సూపర్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార, నార్త్ లో ‘జవాన్‌’తోనూ వెయ్యి కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టారు. ఆమెకు సొంతంగా ప్రైవేట్ జెట్, చెన్నై, ముంబై, హైదరాబాద్‌, కేరళ వంటి నగరాల్లో కోట్లాది రూపాయల విలువైన ఇళ్లూ ఉన్నాయి. సినిమా రెమ్యునరేషన్‌తో పాటు నిర్మాణ సంస్థద్వారానూ, స్కిన్ కేర్ బ్రాండ్స్ ద్వారానూ, ఇతరత్రా వ్యాపారాల ద్వారానూ సంపాదిస్తుంటారు.

లేడీ సూపర్‌స్టార్‌గా ఎప్పుడూ బిజీగా ఉండే నయనతార లైఫ్‌ స్టైల్‌ ఎలా ఉంటుంది? ఆమె రోజులో కంఫర్టబుల్‌గా ఉండాలంటే ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందనే విషయం గురించి భర్త విఘ్నేష్‌ శివన్‌ స్పందించారు. రూ.350కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఉంటే, తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటానని చెప్పారు విఘ్నేష్‌. అదేం లెక్క అని అందరూ ఆశ్చర్యపోతుంటే విఘ్నేష్‌ హ్యాపీగా డీకోడ్‌ చేసి చెప్పేశారు.

350 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ వేస్తే, ఏడాదికి 21 – 24 కోట్ల ద రూపాయలు దాకా వడ్డీ వస్తుంది. దాన్ని డివైడ్‌ చేస్తే నెలకి దాదాపు రెండు కోట్ల రూపాయల దాకా వస్తుంది. రోజుకి ఆరేడు లక్షల రూపాయలు దాకా అందుతుంది. ఇంత మొత్తం వస్తే, తన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందన్నారు విఘ్నేష్‌. అందుకే తానిప్పుడు మనీ మేకింగ్‌ మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నానని తెలిపారు.

ఏ మాత్రం సమయం దొరికినా పెద్ద పెద్ద బిజినెస్‌మేన్‌లతో మాట్లాడుతూ, సలహాలు సూచనలు తీసుకుంటుంటానని చెప్పారు. 350 కోట్లకు ఎంత చేరువలో ఉన్నారని అడిగితే మాత్రం.. చిరునవ్వుతో సమాధానాన్ని దాటవేశారు విఘ్నేష్‌.

ఇద్దరు పిల్లలు, విఘ్నేష్‌ ఖర్చులు పక్కనపెట్టినా.. నయన్‌కి మాత్రం 5 లక్షలు ఖర్చవుతుండవచ్చు అని లెక్కలేసుకుంటున్నారు జనాలు. షూటింగ్‌ సమయంలో చాలా వరకు ఖర్చుల్ని ప్రొడక్షన్‌ హౌస్‌లు భరిస్తాయనుకోవచ్చు. ఒకవేళ షూట్‌ లేకపోతే పర్సనల్‌ మేకప్‌, స్టైలిస్ట్స్, బౌన్సర్స్, క్యారవేన్‌, ఫొటోషూట్స్, హోటల్స్, ఇతరత్రా మెయింటెనెన్స్… అని లెక్కలేసుకుంటే అంత ఖర్చు అయి తీరుతుందనే మాటలు వినిపిస్తున్నాయి.

డబ్బు కంటే ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి, ఆ మాత్రం మెయింటెనెన్స్ తప్పదని అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. విఘ్నేష్‌ చెప్పిన లెక్కల మీద నయన్‌ మాత్రం ఇప్పటిదాకా ఎక్కడా స్పందించకపోవడం గమనార్హం.