July 15, 2026

MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!

MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
Reading Time: < 1 minute
Mlc Ananthababu Bail Cancellation Verdict Deferred To Tomorrow By Rajahmundry Court

ఎమ్మెల్సీ అనంతబాబును తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. 24 గంటల పాటు పోలీస్ కస్టడీలో ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడ సర్పవరం పోలీసులు విచారించారు. విచారణ గడుపు పూర్తి అవడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాకినాడ సర్పవరం పోలీసులు ఎస్కార్ట్ తో ప్రత్యేక వాహనంలో అనంతబాబును సెంట్రల్ జైలుకు అప్పగించారు. ప్రస్తుతం అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై విచారణలో భాగంగా రాజమండ్రి జిల్లా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తీర్పును రేపటికి వాయిదా వేస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో బాధితులు అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.