
హైదరాబాద్ నగరంలో బాచుపల్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య మోసాన్ని భరించలేక సీతారాం ప్రాణాలు తీసుకుంటే.. ఆయన చనిపోయిన నెల రోజులకే అతడి భార్య రేణుక మరో వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తన భార్యకు ఆరుగురు ప్రేమికులు ఉన్నారని.. ఆ బాధ తనను మానసికంగా వేధిస్తోందని ఫిబ్రవరి 9న సీతారాం సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే భర్త కర్మకాండలు ముగియకముందే రేణుక తన ప్రియుడు రమణారెడ్డిని వివాహం చేసుకుంది. 2026 మార్చిలో వీరిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటపడటం కలకల రేపుతోంది.
ఈ రమణారెడ్డి గతం చూస్తే మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. గతంలోనే వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోను రమణారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కుటుంబ సభ్యుల కంటపడటంతో అవమానం భరించలేక అప్పట్లో వీరిద్దరూ ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం కూడా చేశారు.
ఆంధ్రప్రదేశ్ నంద్యాలకు చెందిన రమణారెడ్డి గతంలో షాద్ నగర్‌లో హోటల్ వ్యాపారం నిర్వహించేవాడు. వీడియో వైరల్ వ్యవహారం తర్వాత అక్కడి నుండి మకాం మార్చేశాడు. సీతారాం మరణం వెనుక వీరిద్దరి పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో.. బాచుపల్లి పోలీసులు రేణుకతో పాటు ఆమె ప్రియుడు రమణారెడ్డిని ఇటీవలే అరెస్ట్ చేశారు.