Reading Time: < 1 minute

ఎన్టీఆర్ ‘దేవర’తో సంచలనం సృష్టించిన ప్రముఖ నిర్మాణ సంస్థ యువ సుధ ఆర్ట్ బ్యానర్ మరో భారీ సినిమాను రూపొందించటానికి సిద్ధమైంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతానికి యువ సుధ ఆర్ట్ ప్రొడక్షన్ నెం.3 అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించటంతో పాటు సమర్పకుడిగానూ వ్యవరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ కొట్టగా, నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి, స్క్రిప్ట్‌ను అందించారు. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు రజత్ దర్శకత్వం వహిస్తున్నారు.