Reading Time: < 1 minute

హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మరో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గత మూడు రోజుల నుంచి13 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎన్.జీ. హంక్రాన్ గ్రామంలో రమేష్(17), నాగల్‌గిద్ద మండలం కారముంగి గ్రామానికి చెందిన నందిని(17), నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన మణివర్ధన్, సిద్దిపేట జిల్లా రంగనాయకపురం గ్రామానికి చెందిన పొట్ల ప్రత్యూష(17), నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో భూక్యా ఆకాష్(18) అనే విద్యార్థులు బలవన్మరణం చెందారు. 

సోమవారం హైదరాబాద్ లోని వారసిగూడలో కళ్యాణి(16), మేడ్చల్ జిల్లాలోని నాచారంలో లక్ష్య(16), మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామంలో సాయిరాం(16), ఉట్నూర్ గ్రామంలో సౌజన్య(17), భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో శ్రావణి(17), సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్ల గ్రామంలో సౌజన్య(17), రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ గ్రామంలో అభియాదవ్ అనే ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.