
హీరో టి.గోపీచంద్.. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ డ్రామా ‘గోపీచంద్33’తో తన కెరీర్‌లో ఒక కొత్త శకంలోకి అడుగుపెడుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో, పవన్ కుమార్ సమర్పణలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్, గోపీచంద్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. చిత్ర నిర్మాతలు పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా సినిమా టైటిల్‌ను ఆవిష్కరించారు. క్రీ.శ. 642 నేపథ్యంలో సాగే ఈ గ్లింప్స్, శూల భూమిలో ప్రారంభమై, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో కట్టిపడేసింది. భారీ యుద్ధ సన్నివేశాలు, యుద్ధంలో ఆరితేరిన యోధు ల క్లోజప్‌లు, కత్తులు, గొడ్డళ్లు, అగ్నిజ్వాలల మధ్య జరిగే పోరాటాలు కనువిందు చేసే విజువల్ ఫీస్ట్ ని అందించాయి.
భరత భూమికి (భారతదేశానికి) ప్రతీకగా నిలిచే ’భరత వర్ష’ టైటిల్ తెలియజేయ డం పవర్‌ఫుల్‌గా ఉంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన విజన్ ని అద్భుతంగా ప్రతిబింబిస్తూ, భారత చరిత్రలో ఎక్కువగా పరిశీలించని ఒక అధ్యాయాన్ని గొప్పగా ఆవిష్కరించారు. భారీ స్థాయి, భావోద్వేగపూరిత కథనం, గొప్ప యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటోంది. హీరో గోపీచంద్ ఈ చిత్రంలో యోధుడి పాత్ర కోసం పూర్తిగా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. ఆయన ఫిజిక్, నటన అన్నీ క లిసి పాత్రను ఎంతో నిజాయితీగా కనిపించేలా చే శాయి. ఇది ఆయన గత చిత్రాల నుండి పూర్తిగా భిన్నమైన పాత్రగా నిలుస్తోంది. హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తున్నారు. షూటింగ్ దాదాపు చివ రి దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ వేగంగా కొనసాగుతోంది. భరత వర్ష భారతీయ సినిమాల్లో గుర్తుండిపోయే హిస్టారికల్ డ్రామాగా నిలవబోతోంది.