Reading Time: < 1 minute

భద్రాద్రి జిల్లా పాల్వంచలో ..తల్లి తిట్టిందని స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ సూసైడ్‌‌‌‌‌‌‌‌

Caption of Image.

పాల్వంచ, వెలుగు : తల్లి తిట్టిందన్న మనస్తాపంతో ఆరో తరగతి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ సూసైడ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో బుధవారం జరిగింది. పట్టణంలోని వెంగళరావు నగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన భూక్య కృష్ణ, సునీత దంపతుల కొడుకు మహేందర్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌ (11)కు, పక్కింట్లో ఉండే తన పెదనాన్న కొడుకు పవన్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌కు బుధవారం గొడవ జరిగింది. ఈ క్రమంలో మహేందర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌ తన అన్నను తిట్టడంతో అతడి తల్లి మందలించింది.

దీంతో మహేందర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌ ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఎంత సేపైనా బయటకు రాకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా.. ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.