Reading Time: < 1 minute
Telangana: మీ దుంపతెగ.. ఎమ్మెల్యేనే బుట్టలో వేసుకున్న కేటుగాళ్లు.. కట్‌చేస్తే, అరగంటలోనే..

సైబర్ కేటుగాళ్లు ఎవ్వరినీ వదలడం లేదు.. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు.. ఎవ్వరూ దొరికినా మోసం చేస్తున్నారు. అందిన కాడికి దండుకుంటూ.. ఎన్నో కుటుంబాలను పీల్చిపిప్పి చేస్తున్నారు. తాజాగా.. సైబర్ నేరగాళ్ల చేతిలో తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే మోసపోయారు.. వెంటనే తాను సైబర్ నేరస్తుల చేతిలో మోసపోయానని.. గుర్తించిన ఎమ్మెల్యే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అప్రమత్తమయ్యారు. సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు.. బ్యాంకు అధికారులతో మాట్లాడి.. ఆ లక్ష రూపాయలను ఆపించారు.. సైబర్ మోసాల పట్ల జాగ్రత్త అంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. తాను మోసపోయాను, మీరూ మోసపోకండి అంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అందరికీ సూచించారు..

అసలేం జరిగిందంటే..

వికసిత్ భారత్ పథకం పేరిట ఎమ్మెల్యే నుంచి లక్ష రూపాయలు వసూలుచేశారు సైబర్ కేటుగాళ్లు.. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ అనంతరామిరెడ్డి పేరుతో ఆదివారం రోజు పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫోన్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకం వికసిత్ భారత్‌లో 40 మందికి నిధులు వచ్చే అవకాశం ఉందన్నది ఫోన్ సారాంశం.. దీంతో ప్రజలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే.. ఫోన్ చేసిన వ్యక్తితో మాట్లాడారు.. నియోజకవర్గంలో అర్హులైన 40 మంది జాబితా ఇవ్వాలని చెప్పాడు కేటుగాడు. ఒక్కో లబ్ధిదారుడికి 5 నుంచి 10 లక్షల లబ్ధి చేకూరుతుందన్నాడు . ఒక్కో దరఖాస్తుకు 2500 రూపాయల చొప్పున లక్ష పంపించాలని చెప్పాడు. ఇవాళే ఆఖరు రోజని, లక్ష రూపాయలు పంపించకపోతే 40 మంది అవకాశాన్ని కోల్పోతారంటూ ఫోన్‌లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెప్పాడు.

దీంతో ప్రజలకు మేలు జరుగుతుందని.. ఇదంతా నిజమని నమ్మిన పల్లా వెంటనే ఫోన్‌పే ద్వారా లక్ష రూపాయలు పంపించారు.. ఆ తర్వాత రెస్పాన్స్ లేకపోవడంతో సైబర్ మోసం జరిగిందంటూ తెలుసుకున్నారు ఎమ్మెల్యే.. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పల్లా రాజేశ్వరరెడ్డి..

అయితే.. లక్షరూపాయలు పంపిన తర్వాత వెంటనే.. అలర్టయ్యాయని.. అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పారు. సైబర్ నేరస్తుడు చెప్పిన అడ్రస్ ను ట్రేస్ చేస్తే.. చంచల్ గూడా చూపిస్తుందని.. ఫోన్ చూస్తే కర్ణాటక చూపిస్తుందని చెప్పారు. సైబర్ క్రైం విషయంలో అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వీడియో చూడండి..