Reading Time: < 1 minute

దండేపల్లి మండలంలో షాప్ ఓనర్లకు నోటీసులు

Caption of Image.

దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం పుణ్యక్షేత్రంలో మద్యం, మాంసం విక్రయిస్తున్న దుకాణదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. సత్యనారాయణ స్వామి ఆలయ పరిసరాల్లో మద్యం, మాంసాహార విక్రయాలపై అధికారులు కఠిన నిబంధనలు విధించారు. 

గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న క్రమంలో ఆలయ పవిత్రతను కాపాడాలని దుకాణదారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీవో విజయ్ ప్రసాద్, ఎస్సై తహసీనోద్దీన్, ఆర్ఐ భూమన్న, పంచాయతీ సెక్రటరీ నాగరాజు ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.