Reading Time: < 1 minute
Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం.. ఈ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్..

హైదరాబాద్‌లో ఊబకాయం రికార్డు స్థాయికి చేరుకుంది. నగరంలో ఏకంగా 81.3శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 నివేదిక వెల్లడించింది.అత్యధిక ఊబకాయం ఉన్న నగరాల్లో ముంబై 81.6శాతం తో మొదటి స్థానంలో ఉండగా భాగ్యనగరం రెండో స్థానంలో నిలిచింది. 2025లో 63శాతం ఉన్న ఈ రేటు, కేవలం ఏడాదిలోనే భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం జంక్ ఫుడ్ మాత్రమే కాదు.. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వాడకం కూడా ఊబకాయానికి ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిద్రపోయే వరకు ఫోన్ స్క్రోల్ చేయడం వల్ల బాడీ సైకిల్ దెబ్బతింటోంది.తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ఇప్పటికే దేశానికి డయాబెటిస్ క్యాపిటల్‌గా మారుతోంది. పెరిగిన ఈ ఊబకాయం రేటు వల్ల 20 ఏళ్లకే జీవనశైలి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల సలహా లేకుండా స్టెరాయిడ్లను దీర్ఘకాలం వాడటం వల్ల కూడా బరువు విపరీతంగా పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఇది డయాబెటిస్, ఎముకల బలహీనతకు దారితీస్తోంది. నిద్రపోయే ముందు వరకు ఫోన్ వాడటం వల్ల బాడీ సైకిల్ దెబ్బతిని, మెటబాలిజం క్రమం తప్పుతోంది. ఫలితంగా బరువు విపరీతంగా పెరుగుతోంది. శారీరక శ్రమ లేకపోవడం: ఐటీ కల్చర్, కూర్చుని చేసే పనుల వల్ల వ్యాయామం తగ్గిపోవడం మరో ప్రధాన కారణం.

ఒకప్పుడు పెద్దలకే పరిమితమైన నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి ఇప్పుడు చిన్నారుల్లోనూ అధికంగా కనిపిస్తోంది. శారీరక శ్రమ లేకపోవడమే దీనికి కారణం. జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండడం, రోజూ కనీసం 30-45 నిమిషాల శారీరక శ్రమ, నిద్రకు ముందు గంట ముందే స్మార్ట్‌ఫోన్‌ పక్కన పెట్టడం లాంటివి చేస్తే బయటపడే చాన్స్ ఉందని నిపుణుల సూచన.