
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగేలా కనిపించడం లేదు. లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్ చేసిన ఈ వైమానిక దాడుల్లో లెబనాన్లోని బీరూట్లో దాదాపు 89 మంది చనిపోయారు. 700 మందికి పైగా గాయపడ్డారు. సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత కూడా లెబనాన్పై ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటంపై ఇరాన్ సీరియస్ అయింది.
Iran says it is halting traffic in the Strait of Hormuz after Israel attacked Lebanon, testing fragile ceasefire deal. Follow live updates. https://t.co/xziHIQXGVX pic.twitter.com/0kVTS9Fyqo
— CNN (@CNN) April 8, 2026
హార్మూజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసేసింది. దీంతో.. చమురు ట్యాంకర్లతో హార్మూజ్ జలసంధి మీదుగా వెళ్లేందుకు సిద్ధమైన నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అమెరికా-ఇరాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ లైట్ తీసుకోవడంతో ఇరాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై పునరాలోచన చేస్తున్నట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అమెరికాతో ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని రద్దు చేసుకుని మళ్లీ యుద్ధంలోకి దిగాలని ఇరాన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
►ALSO READ | సీజ్ ఫైర్ లేదు.. తొక్క లేదు.. మిస్సైల్స్తో లెబనాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్ !
ఇదే గానీ జరిగితే.. ఈ రెండు వారాల సీజ్ ఫైర్ ఒప్పందం ఒక్కరోజులోనే అటకెక్కినట్టే. అయితే.. లెబనాన్ పై దాడులను ఇజ్రాయెల్ సమర్ధించుకుంది. ఇరాన్-అమెరికా మధ్య జరిగిన సీజ్ ఫైర్ డీల్ లెబనాన్కు వర్తించదని.. ఈ సీజ్ ఫైర్ డీల్లో లెబనాన్కు చోటు లేదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ప్రకటించారు.
🔴 Iran has stopped oil tankers passing through the Strait of Hormuz, breaching the terms of its ceasefire with the US.
The regime’s state media reported that traffic was forcibly halted in response to Israel carrying out its heaviest strikes of the war against Lebanon… pic.twitter.com/m5EVsACnwQ
— The Telegraph (@Telegraph) April 8, 2026
హార్మూజ్ తిరిగి అందుబాటులోకి వచ్చాక.. రెండు నౌకలు ఈ జలసంధి మీదుగా వెళ్లాయని సముద్ర పర్యవేక్షణ సంస్థ మెరైన్ ట్రాఫిక్ బుధవారం తెలిపింది. తిరిగి.. మళ్లీ హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. పరిస్థితి మళ్లీ ఉద్రిక్తతలకు దారితీసేలా ఉందని.. చమురు సంక్షోభం తప్పేలా లేదని ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది.