Reading Time: 2 minutes
Sanjay Dutt The 1000 Crore King Kgf 2 Jawan Dhurandhar 2 Box Office Records

ఇండియన్ సినిమా హిస్టరీలో 1000 కోట్ల క్లబ్ అంటే ఒకప్పుడు అరుదైన రికార్డు. కానీ ఇప్పుడు ఒక హీరో కాదు, ఒక నటుడు నాలుగు సార్లు ఆ ఫీట్ సాధించాడు. KGF Chapter 2 నుంచి… ధురంధర్ 2 వరకు ప్రతి సినిమాలో డిఫెరెంట్ గెటప్, వెరైటీ అటిట్యూడ్. కానీ, ఒకే కామన్ పాయింట్ స్క్రీన్ మీద కనిపిస్తే, స్క్రీన్ షేక్ అవుతుంది. వెయ్యి కోట్ల క్లబ్ లో ఫోర్ టైమ్స్‌ చేరిన యాక్టర్ మరెవరో కాదు సంజయ్ దత్. KGF Chapter 2లో సంజయ్ దత్ చేసిన అధీరా పాత్ర.. ఒక విలన్ కాదు, ఒక వైల్డ్ ఫోర్స్. వైకింగ్ స్టైల్ లుక్, రఫ్ బాడీ బ్రూటల్ మెంటాలిటీ రాఖీకి ఎదురు నిలిచే పవర్‌ఫుల్ వారియర్‌గా కనిపించాడు. లంగ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో కూడా తన డబ్బింగ్ తానే పూర్తి చేసి, డెడికేషన్ అంటే ఇదే అని చూపించాడు.

Also Read :Yash : హైప్ ఉన్నంత కంటెంట్ ఉంటుందా?

జవాన్ లో సంజయ్ దత్ పాత్ర చిన్నదే అయినా, స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి థియేటర్‌లో విజిల్స్ పడ్డాయి. షారూక్ ఖాన్ తో మొదటి స్క్రీన్ షేర్ చేసుకున్నా, క్లైమాక్స్‌లో ఆయన ప్రెజెన్స్ కథకి మరింత గ్రావిటీ ఇచ్చింది. కొన్ని నిమిషాలే ఉన్నా, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక సినిమా లెవెల్ ! ధురంధర్ లో సంజయ్ దత్ SP చౌదరి అస్లామ్ గా, ఒక రియల్ లైఫ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపించాడు. రూల్స్‌ని పట్టించుకోని అగ్రెసివ్ పోలీస్, గ్రాంగ్‌స్టర్స్‌ మీద యుద్ధం చేసే ఒక రూత్ లెస్ ఆఫీసర్. ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించే ప్రతి సీన్‌లో భయం, రిస్పెక్ట్ రెండూ కలుగుతాయి. ధురంధర్ 2లో అదే అస్లాం క్యారెక్టర్ మరింత పవర్‌ఫుల్‌గా, SSP రేంజ్‌లో మరింత అగ్రెసివ్‌గా మారింది. సిస్టమ్‌కి బయట పని చేసే ఆఫీసర్‌గా, గ్యాంగ్స్, మిలిటెంట్స్‌పై విరుచుకుపడే ఒక యుద్ధంలా కనిపించాడు. “బడే సాబ్” అనే మిస్టరీతో, కథకి ఇంకో లేయర్ తీసుకొచ్చాడు. అస్లామ్‌ చౌదరీ అనే పాత్రతో సంజయ్ దత్ తన రేంజ్ వాల్డ్‌వైడ్‌గా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. నాలుగు సినిమాలు, నాలుగు వేర్వేరు పాత్రలు… కానీ ఒకే రిజల్ట్… 1000 కోట్ల సునామీ! అందుకే సంజయ్ దత్ కేవలం ఒక నటుడు కాదు, బాక్సాఫీస్ కా ధురంధర్‌.