Reading Time: 2 minutes
Donald Trump To Appear On 24 Karat Gold Coin Us Treasurys Bold Move For 250th Anniversary

అమెరికా స్వాతంత్ర్యం 250వ వార్షికోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇమేజ్‌తో 24-క్యారట్ బంగారు కమెమరేటివ్ కాయిన్ ముద్రించేందుకు అధికారికంగా అనుమతి లభించింది. ఇది అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన, చరిత్రాత్మక నిర్ణయం. అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1776 జూలై 4న స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. 13 అమెరికన్ కాలనీలు గ్రేట్ బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంటూ, అమెరికా స్వాతంత్ర్య ప్రకటనను ఆమోదించాయి. అందువల్ల, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రతి సంవత్సరం జూలై 4వ తేదీని స్వాతంత్ర్య దినోత్సవంగా బాణాసంచా, కవాతులు, ఉత్సవాలతో జరుపుకుంటారు.

Also Read:Swastik Chikara: ఐపీఎల్ 2026 అవకాశం మిస్ చేసిన RCB.. అయోధ్యలో స్వస్తిక్ చికారా 21 సిక్సర్ల సాయంతో 195*తో రివెంజ్..

ట్రంప్ ఓవల్ ఆఫీస్‌లో రెసల్యూట్ డెస్క్ మీద చేతులు ఆని, స్టెర్న్ ఎక్స్‌ప్రెషన్‌తో లీన్ అయిన పోజ్‌లో ఉన్నారు (వైట్ హౌస్ అధికారిక ఫోటోగ్రాఫర్ డానియల్ టోరోక్ తీసిన ఫోటో ఆధారంగా). ముందు వైపు “LIBERTY”, “IN GOD WE TRUST”, 1776-2026 తేదీలు ఉంటాయి. వెనక వైపు ఈగిల్ (అమెరికా చిహ్నం) ఉండవచ్చు. మార్చి 19, 2026న U.S. Commission of Fine Arts (CFA) ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కమిషన్ సభ్యులంతా ట్రంప్ నియమించినవారే.

24-క్యారట్ గోల్డ్ (ప్యూర్ గోల్డ్), కమెమరేటివ్ (సేకరణ కోసం), సర్క్యులేషన్ కోసం కాదు. సైజు, డినామినేషన్ (విలువ) ఇంకా ఫైనల్ కాలేదు. కానీ హండ్రెడ్స్ లేదా థౌజండ్స్ డాలర్ల విలువ ఉండవచ్చు (కొన్ని కమెమరేటివ్ గోల్డ్ కాయిన్స్ వేల డాలర్లకు అమ్ముడవుతాయి). సాధారణంగా లివింగ్ ప్రెసిడెంట్‌ను కరెన్సీ మీద పెట్టడం నిషేధం (federal law). కానీ Treasury Secretary Scott Bessent 31 U.S.C. § 5112 సెక్షన్ కింద గోల్డ్ కాయిన్స్‌కు స్పెషల్ అథారిటీ ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది రేర్ ఇన్‌స్టాన్స్.

అమెరికాలో ఒక స్మారక బంగారు నాణెంపై పదవిలో ఉన్న అధ్యక్షుడి చిత్రం కనిపించడం ఇది మొదటిసారి కాదు. గతంలో, అమెరికా స్వాతంత్ర్య 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 1926లో జారీ చేసిన ఒక స్మారక నాణెంపై జార్జ్ వాషింగ్టన్‌తో పాటు కోల్విన్ కూలిడ్జ్ కూడా కనిపించారు. అయితే, సాధారణంగా అమెరికా చట్టం ప్రకారం, పదవిలో ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని కరెన్సీపై ముద్రించడం నిషిద్ధం.

మార్చి 19న యూఎస్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నాణెం డిజైన్‌ను ఆమోదించింది. అయితే, నాణెం పరిమాణానికి, ట్రంప్ చిత్రంతో దాని జారీకి సంబంధించిన అధికారిక ఆమోదం ఇంకా పెండింగ్‌లో ఉంది. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, 250 ఏళ్ల వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ నాణాన్ని రూపొందిస్తున్నామని, దీనికి ట్రంప్ కంటే గొప్ప చిహ్నం మరొకటి ఉండదని యూఎస్ ట్రెజరీ అధికారి బ్రాండన్ బీచ్ అన్నారు.

డెమొక్రాట్లు ఈ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ నాయకులు దీనిని ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. డెమోక్రటిక్ సెనేటర్ జెఫ్ మెర్క్లీ మాట్లాడుతూ, “నాణేలపై ఉన్న ముఖాలు నియంతలు, రాజులవి, ప్రజాస్వామ్య నాయకులవి కావు” అని అన్నారు. ఈ నాణేన్ని సాధారణ కరెన్సీగా కాకుండా, సేకరించదగిన వస్తువుగా జారీ చేస్తారని, అందువల్ల ఇది ప్రస్తుత చట్ట పరిధిలోకి రాదని యూఎస్ ట్రెజరీ చెబుతోంది.

Also Read:Pakistan: ప్రేక్షకులే లేకుండానే PSL మ్యాచ్‌లు.. పాకిస్తాన్ భయానికి కారణం ఇదే..

ఇదిలా ఉండగా, అమెరికా 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక నాణేలు, పతకాలను జారీ చేయాలని యోచిస్తున్నారు. అమెరికా స్వాతంత్ర్యానికి చిహ్నమైన లిబర్టీ బెల్ చిత్రాన్ని కలిగి, “1776–2026” అనే అక్షరాలతో ఒక ప్రత్యేక డిజైన్ నాణేన్ని 2026లో జారీ చేయనున్నట్లు యూఎస్ మింట్ ప్రకటించింది. అమెరికా చరిత్ర, చిహ్నాలలో తన ప్రతిబింబాన్ని శాశ్వతంగా చెక్కించుకోవడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నంలో ఈ చర్య ఒక భాగమని విమర్శకులు అంటున్నారు.