Reading Time: < 1 minute
Trump Iran Tensions Hormuz Strait Warning Counter Attack Threat

Iran warns of attacks on US: ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. అమెరికాకు ఇదే చివరి వార్నింగ్ అంటూ హెచ్చరికలు జారీ చేసింది.. తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే ఊరుకోమని తేల్చి చెప్పేసింది.. అమెరికా మిత్ర దేశాలపైనా తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామని స్పష్టం చేసింది.. ఆయిల్, ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఐటీ, నీటిశుద్ధి కేంద్రాలను ధ్వంసం చేస్తామని ఇరాన్ ప్రకటించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్ధృతంగా మారింది.

READ MORE: Ishan Kishan: ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్‌ ఇషాన్‌కు అవమానం?.. సొంత జట్టు స్పిన్నర్ అగ్రెసివ్ రియాక్షన్ (వీడియో)..

ఇంతకీ ట్రంప్ ఏమన్నారు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు బిగ్ వార్నింగ్ ఇచ్చారు.. ప్రపంచ మార్కెట్లకు చమురు చేరే ప్రధాన మార్గమైన హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా టెహ్రాన్ పూర్తిగా తెరవకపోతే, ఇరాన్ పవర్ ప్లాంట్స్‌ను నాశనం చేస్తానని హెచ్చరించారు. చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఈ జలసంధిని సురక్షితం చేయాలని ట్రంప్‌పై స్వదేశంలో ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చారు. “ఈ క్షణం నుంచి సరిగ్గా 48 గంటలు టైమ్ ఇస్తున్నాం. ఇరాన్ ఎటువంటి బెదిరింపులు లేకుండా హర్మూజ్‌ జలసంధిని (Strait of Hormuz) పూర్తిగా తెరవాలి. లేదంటే ఇరాన్‌లోని విద్యుత్‌ కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తుంది. వివిధ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేస్తాం.” అని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ వేదికగా ట్రంప్ రాసుకొచ్చారు. ట్రంప్ వార్నింగ్‌పై స్పందించిన ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది.

READ MORE: Chicken Price Hike: నాన్‌వెజ్ ప్రియులకు భారీ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయికి చికెన్ ధరలు!