Reading Time: < 1 minute
Gut Health Good Bacteria Foods List Telugu

Gut Health Tips: మన శరీరంలోని రోగనిరోధక శక్తిలో 70 శాతం పేగుల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పేగులు కేవలం ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా, శరీరంలో ‘రెండో మెదడు’లా పనిచేస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలన్నా పేగుల్లో ఉండే ‘మంచి బ్యాక్టీరియా’ (గట్ మైక్రోబయోమ్) ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఇందుకోసం తీసుకోవాల్సిన ఆహారాల గురించి క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అదితి ప్రసాద్ ఆప్టే కొన్ని కీలక సూచనలు చేశారు.

1. ప్రోబయోటిక్ ఆహారాలు (Probiotics): ఇవి నేరుగా శరీరానికి లైవ్ బ్యాక్టీరియాను అందిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచి గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి.

పెరుగు, మజ్జిగ: ఇవి మనకు సులభంగా దొరికే అత్యుత్తమ ప్రోబయోటిక్స్.

పులియబెట్టిన పదార్థాలు: ఇడ్లీ, దోశ, గంజి వంటివి పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఇతరాలు: కెఫీర్, కిమ్చీ, సౌర్‌క్రాట్ (పులియబెట్టిన క్యాబేజీ), కీరదోస వంటి పులియబెట్టిన కూరగాయలు.

2. ప్రిబయోటిక్ ఆహారాలు (Prebiotics): మంచి బ్యాక్టీరియా పెరగడానికి కావాల్సిన ఆహారాన్నే ‘ప్రిబయోటిక్స్’ అంటారు.

కూరగాయలు: వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చి కూరగాయలు.

పండ్లు: అరటిపండు, ఆపిల్.

ధాన్యాలు: ఓట్స్, తృణధాన్యాలు.

3. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు (Fiber Rich Foods): పీచు పదార్థం పేగుల కదలికలను క్రమబద్ధీకరిస్తుంది.

బ్రకోలి: ఇందులోని సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం పేగు పొరను బలపరుస్తుంది.

ఇతరాలు: చిక్కుళ్లు, నట్స్, విత్తనాలు , తాజా పండ్లు.

ఆరోగ్యకరమైన గట్ కోసం మరికొన్ని చిట్కాలు:

నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి.

బాగా నమలడం: ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల జీర్ణ ప్రక్రియ నోటిలోనే మొదలవుతుంది.

చక్కెర తగ్గించడం: స్వీట్లు, కూల్ డ్రింక్స్ చెడు బ్యాక్టీరియాను పెంచుతాయి, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

భోజన సమయం: పడుకోవడానికి 2-3 గంటల ముందే రాత్రి భోజనం ముగించాలి. భోజనం తర్వాత 15-20 నిమిషాల నడక జీర్ణక్రియకు ఎంతో మంచిది.

పులియబెట్టిన ఆహారాలు , పీచు కలిగిన ఆహారాల కలయిక మీ పేగు ఆరోగ్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. సరైన జీవనశైలి , ఆహారపు అలవాట్లతో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Godavari Bathing Ghats : గోదావరి స్నాన ఘాట్ల దుస్థితి.. పవిత్రత మాయం.. అపరిశుభ్రతకు నిలయం.!