Reading Time: < 1 minute
Chirus Emotional Tweet On Ntrs National Award

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్” వేడుక గురువారం హైటెక్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరించిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర నటులు, గేయ రచయితలు, నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకున్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.

Also Read : Golmal 5 : బాలీవుడ్ కామెడీ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ గోల్మాల్ 5లో విలన్ గా స్టార్ హీరో

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘ చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు… తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. ఎన్టీఆర్ అంటే… N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా… ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది. అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం, నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని పోస్ట్ చేసారు.