Reading Time: < 1 minute
Ntrs Oosaravelli Re Release On May 20 A Birthday Treat For Fans

నందమూరి అభిమానులకు ఉగాది పర్వదినం వేళ ఒక అదిరిపోయే తీపి కబురు అందించారు. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 20న బాక్సాఫీస్ వద్ద వేడుకలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిన ఊసరవెల్లి‘  సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నట్లు  అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.

Also Read : Rajni : 35 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తోన్న రజనీకాంత్ – శోభన

ప్రతి ఏటా ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన నటించిన పాత సూపర్ హిట్ చిత్రాలను రీ-రిలీజ్ చేయడం ఒక ఆనవాయితీగా మారింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఊసరవెల్లి’ని రీరిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన  సంగీతం, మరియు ఆ చిత్రంలోని ఎమోషనల్ యాక్షన్ సీన్లు అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మా ఫేవరెట్ ‘ఊసరవెల్లి’ గ్రాండ్ థియేట్రికల్ సెలబ్రేషన్స్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ చిత్ర బృందం అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ మే 20న రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున షోలు పడనున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో #NTRBirthday మరియు #OosaravelliReRelease వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.