Reading Time: < 1 minute
Oneplus 15t Launch On March 24 165hz Display 100w Charging 7500mah Battery

OnePlus 15T: కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో స్మార్ట్ ఫోన్ ను తీసుకురావడానికి వన్ ప్లస్ (OnePlus) సిద్ధమైంది. కంపెనీ తన తాజా స్మార్ట్‌ఫోన్ OnePlus 15Tను మార్చి 24న చైనాలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. “స్మాల్-స్క్రీన్ పవర్‌హౌస్”గా దీన్ని ప్రమోట్ చేస్తూ, చిన్న ఫోన్లలో కూడా భారీ పనితీరు సాధ్యమేనని వన్ ప్లస్ చెబుతోంది.

Divyang Shakti Scheme: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం!

ఈ వన్ ప్లస్ 15Tలో 6.32 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 165Hz హై రిఫ్రెష్ రేట్, 1.1mm అల్ట్రా-న్యారో బెజెల్స్, ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ లతోపాటు పూర్తి స్థాయి వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ప్యూర్ కోకా, రిలాక్సింగ్ మత్సా, హీలింగ్ వైట్ చాక్లెట్ అనే మూడు ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది AnTuTuలో 44.5 లక్షల పాయింట్లు సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇంకా గేమింగ్, హెవీ టాస్క్‌ల కోసం “Wind Chaser Gaming Core”, “Esports Triple Core” వంటి టెక్నాలజీలు వాడారు.

Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

OnePlus 15Tలో 7500mAh “గ్లేసియర్ బాటరీ” ప్రత్యేకత. సాధారణంగా పెద్ద ఫోన్లలో మాత్రమే కనిపించే ఈ సామర్థ్యాన్ని కాంపాక్ట్ డివైస్‌లో అందించారు. ఈ బ్యాటిరికి 100W ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ ఫ్లాష్ చార్జింగ్ అందించారు. ఈ ఫోన్‌లో 3.5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అందిస్తున్నారు. ఇది గత మోడల్‌లో లేని ముఖ్యమైన అప్‌గ్రేడ్‌గా చెప్పొచ్చు. చిన్న సైజ్‌ లో ఫ్లాగ్‌షిప్ పనితీరు, భారీ బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లతో ప్రత్యేకంగా నిలవనుంది. ధర వివరాలు లాంచ్ రోజున ప్రకటించనున్నారు.