Reading Time: 2 minutes
Kim Jong Un Not On Ballot But His Regime Grabs 99 93 In Supreme Peoples Assembly Vote

ఉత్తర కొరియా పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ జోంగ్ ఉన్ పార్టీ హిస్టరీ క్రియేట్ చేసింది. ఏకంగా 99.93% మెజారిటీతో కిమ్ పార్టీ గెలుపొందింది. ఈ గెలుపుతో ప్రపంచం ఆశ్చర్యపోయింది. మార్చి 15, 2026న జరిగిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ (పార్లమెంట్) ఎన్నికల్లో కిమ్ జాంగ్-ఉన్ నేతృత్వంలోని వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా (Workers’ Party of Korea)కు భారీ విజయం లభించింది. అయితే, అరుదైన 0.07% వ్యతిరేకత సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ ప్రకారం, 2026 పార్లమెంటరీ ఎన్నికలలో కిమ్ జోంగ్ ఉన్ కొరియా వర్కర్స్ పార్టీ, దాని మిత్రపక్షాలు 99.97% ఓట్లను, అన్ని సీట్లను కైవసం చేసుకోవడంతో ఆయన మరో భారీ ఎన్నికల విజయాన్ని సాధించారు.

Also Read:Divyang Shakti Scheme: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం!

15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోవడానికి మార్చి 15న ఈ ఓటింగ్ జరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం, నమోదైన ఓటర్లలో 99.99% మంది పాల్గొన్నారు. కేవలం 0.0037% మంది మాత్రమే విదేశాలలో ఉండటం లేదా సముద్రంలో పనిచేయడం వల్ల ఓటు వేయలేకపోయారు. 0.00003% మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓటు వేసిన వారిలో, 99.93% మంది అభ్యర్థులకు మద్దతు ఇవ్వగా, 0.07% మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఉత్తర కొరియా ఎన్నికలలో ఇది ఒక అసాధారణమైన గణాంకం.

ఈ ఎన్నికలు ఉత్తర కొరియాలో సాధారణంగా జరిగే విధంగానే ఉన్నాయి. ఇక్కడ ప్రతి స్థానానికి ఒకే అభ్యర్థి (ప్రభుత్వం ఆమోదించినవారు) మాత్రమే ఉంటారు. ఓటర్లు ఆ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా లేక వ్యతిరేకించాలా అనే ఎంపిక ఉంటుంది కానీ, వాస్తవంలో ఇది ఒక రకమైన రాజకీయ ప్రదర్శనగా భావిస్తారు. దాదాపు 100% హాజరు, భారీ మెజారిటీ ఓట్లు దేశంలోని “ఏకీభవనం”, “కిమ్ కుటుంబం పట్ల భక్తి”ని చూపించేందుకు ఉపయోగపడతాయని అంతర్జాతీయ మీడియా, విశ్లేషకులు అంటున్నారు. ఈసారి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కిమ్ జాంగ్-ఉన్ స్వయంగా అభ్యర్థిగా పోటీ చేయలేదు (ఇది అరుదైన సంఘటన). అయితే, అతని సోదరి కిమ్ యో-జాంగ్ వంటి కీలక వ్యక్తులు పార్టీలో మరింత బలపడ్డారని తెలుస్తోంది.

Also Read:TGSRTC ఉద్యోగులకు షాక్.. ఆ ఇంక్రిమెంట్ నిలిపివేత..!

ఈ ఎన్నికల తర్వాత సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ రాజ్యాంగ సవరణలు, దక్షిణ కొరియాతో సంబంధాలపై కొత్త విధానాలు చర్చించే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఈ ఫలితాలను “రబ్బర్-స్టాంప్” (రబ్బరు ముద్ర వేసినట్టు) ఎన్నికలుగా, నిజమైన పోటీ లేని ప్రక్రియగా వర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో “0.07% వ్యతిరేక ఓట్లు ఎవరివి?” అని జోకులు, మీమ్‌లు వైరల్ అవుతున్నాయి. ఉత్తర కొరియా ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత నియంత్రిత, ప్రదర్శనాత్మక ఎన్నికలుగా పరిగణించబడతాయి, ఇక్కడ ఫలితాలు ఎల్లప్పుడూ దాదాపు 100%కి దగ్గరగా ఉంటాయి.