Reading Time: < 1 minute
Prabhas Fauji Release Date Locked Rebel Star To Storm Box Office For Dussehra 2026

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు డార్లింగ్. అందులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ వార్ డ్రామా ‘ఫౌజీ’ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే, అనుకున్న సమయానికి షూటింగ్ ఫినిష్ అవడం కష్టమని, ఫలితంగా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, లేటెస్ట్‌గా.. ఏది ఏమైనా సరే ఈ చిత్రాన్ని 2026 విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారట.

Also Read:Ustaad Bhagat Singh: బావ.. మాటల్లేవ్! టాప్ లేచిపోద్ది!

దసరా సీజన్ టాలీవుడ్‌లో అతిపెద్ద సినిమాలకు కలిసొచ్చే సమయం కావడంతో, ఆ లోపే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు హను రాఘవపూడి విజన్‌పై పూర్తి నమ్మకంతో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, ఆయనకు పూర్తిగా ‘ఫ్రీ హ్యాండ్’ ఇచ్చినట్లు తెలుస్తోంది. టెక్నికల్ వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, అనుకున్న సమయానికి అవుట్‌పుట్ తీసుకురావడమే లక్ష్యంగా టీమ్ పనిచేస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. ఈ ఏడాది జూలై లేదా ఆగస్టు లోపు షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంతో ఇమాన్వీ హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అవుతోంది. మొత్తంగా.. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.