Reading Time: < 1 minute
Onebattleafteranother Sweeps 2026 Oscars With 6 Major Wins

 ప్రపంచ సినిమా దిగ్గజాలు పాల్గొన్న 98వ ఆస్కార్ వేడుకల్లో ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ చిత్రం అగ్రగామిగా నిలిచింది. లియొనార్డ్ డికాప్రియో నటించిన ఈ సినిమా మొత్తం 13 విభాగాల్లో నామినేషన్లు పొందిగా అత్యంత కీలకమైన ‘ఉత్తమ చిత్రం’ సహా ఆరు పురస్కారాలను గెలుచుకుంది. హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ తన సుదీర్ఘ కెరీర్‌లో మొదటిసారిగా ఈ చిత్రంతో ‘ఉత్తమ దర్శకుడి’గా ఆస్కార్‌ను అందుకోవడం విశేషం.

Also Read : Bollywood : భారత్ విభజన తర్వాత జ్ఞాపకాలు, ప్రేమ చుట్టూ తిరిగే భావోద్వేగ కథతో వస్తున్న స్టార్ డైరెక్టర్

ఈ చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్న కల్నల్ స్టీవెన్ లాక్‌జా పాత్రలో అద్భుతంగా నటించిన సీన్ పెన్ ఉత్తమ సహాయ నటుడు’ అవార్డును గెలుచుకున్నారు. ఆయనకు ఇది మూడవ ఆస్కార్ అవార్డు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఈ వేడుకకు హాజరు కాలేదు. ఆయన తరపున నటుడు కియారన్ కల్కిన్ ఈ అవార్డును అందుకున్నారు.  కేవలం నటన, దర్శకత్వమే కాకుండా సాంకేతిక విభాగాల్లోనూ ఈ చిత్రం తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ మరియు ఆస్కార్ చరిత్రలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ‘బెస్ట్ కాస్టింగ్’ విభాగంలో కూడా ఈ చిత్రం అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

విజేతల జాబితా (One Battle After Another) :

  • ఉత్తమ చిత్రం: వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్

  • ఉత్తమ దర్శకుడు : పాల్ థామస్ ఆండర్సన్

  • ఉత్తమ సహాయ నటుడు : సీన్ పెన్

  • ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే : పాల్ థామస్ ఆండర్సన్

  • ఉత్తమ ఎడిటింగ్ : ఆండీ జుర్గెన్సెన్

  • ఉత్తమ కాస్టింగ్ : కసాండ్రా కులుకుండిస్