Reading Time: < 1 minute
Hyderabad Horror 6 Year Old Girl Raped And Murdered In Narsingi Accused Arrested

Hyderabad: హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెల్ని పిండేసే ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. మానవత్వం అనే విషయాన్ని మంట కలుపుతూ కేవలం ఆరేళ్ల వయసున్న ఓ చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ ఈవెంట్ కు తమన్ & దేవి శ్రీ డుమ్మా.. కావాలనే రాలేదా

అందిన సమాచారం మేరకు నార్సింగిలో నివసించే ఆరేళ్ల బాలిక ఆదివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. అయితే ఉనట్లుంది కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిన్నారి అదృశ్యంపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

DME Fuel: వంట గ్యాస్ ధరలకు ఇక చెక్.. మార్కెట్లోకి భారత్ సొంత గ్యాస్! ఇక సామాన్యుడికి పండగే

రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి, తన వెంట తీసుకువెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఆధారాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, కొద్దిసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఎక్కడ దొరికిపోతానో అన్న భయంతో ఆమెను దారుణంగా హత్య చేసినట్లు తెలిపాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిందితుడు చూపిన ప్రాంతంలో పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించే ప్రక్రియలో ఉన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా వేగంగా విచారణ చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు.