Reading Time: 2 minutes
Vaibhav Suryavanshi Aims To Break Chris Gayle 175 Run Ipl Record

Vaibhav Suryavanshi: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మార్చి 15న న్యూఢిల్లీలో అట్టహాసంగా నిర్వహించిన ‘నమన్ అవార్డుల’ వేడుకలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా స్టార్స్ సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మలతో కలిసి వేదికను పంచుకున్న 14 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, తన ఫ్యూచర్ ప్లాన్స్‌ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

READ ALSO: Hyderabad: ఘోరం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై హత్య!

హర్ష భోగ్లే ప్రశ్న.. వైభవ్ అదిరిపోయే సమాధానం..
ఈ వేడుకలో ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే వైభవ్‌ను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. “ఐపీఎల్‌లో నీవు బద్దలు కొట్టాలనుకుంటున్న అతిపెద్ద రికార్డు ఏది?” అని అడగ్గా.. బీహార్‌కు చెందిన ఈ యువ సంచలనం తడుముకోకుండా సమాధానమిచ్చాడు. “క్రిస్ గేల్ నెలకొల్పిన 175 నాటౌట్ రికార్డును బద్దలు కొట్టడమే నా లక్ష్యం” అని తన ఆత్మవిశ్వాసాన్ని చాటాడు. 2013లో పూణే వారియర్స్‌పై గేల్ కేవలం 66 బంతుల్లోనే ఈ చారిత్రాత్మక స్కోరు సాధించిన సంగతి తెలిసిందే. వైభవ్ మాటలు కేవలం అతిశయోక్తి కాదని అతని గణాంకాలు చెబుతున్నాయి. 2026 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై వైభవ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అతని అద్భుత బ్యాటింగ్‌తో భారత్ రికార్డు స్థాయిలో ఆరోసారి ఛాంపియన్‌గా నిలిచింది.

ఐపీఎల్‌లో రికార్డుల రారాజు..
వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఐపీఎల్‌లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ, కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని, ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ (30 బంతులు) తర్వాత అత్యంత వేగంగా వంద పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఒక భారతీయుడికి ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. చిన్న వయసులోనే దిగ్గజాల రికార్డులపై కన్నేసిన వైభవ్, భవిష్యత్తులో టీమిండియాలో కీలక ఆటగాడిగా మారతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026లో వైభవ్ మరెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

READ ALSO: Isha Ambani: ఆస్కార్ వేదికపై అంబానీ కుమార్తె సోయగం.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఇషా!