Reading Time: 2 minutes
Ustaad Bhagat Singh Trailer Chiranjeevi Reaction

Megastar Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ఈ ఏడాది ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూసిన అభిమానులు పండగ చేసుకుంటుంటే, తాజాగా మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది.

READ ALSO: Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మెగా రియాక్షన్..
చిరంజీవి తనదైన శైలిలో చిత్ర యూనిట్‌ను ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేశారు.. “మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో అన్నీ శుభాలే!!” అంటూ కామెంట్ చేశారు. మెగాస్టార్ నుంచి వచ్చిన ఈ పాజిటివ్ రెస్పాన్స్ మెగా అభిమానుల్లో జోష్ నింపడమే కాకుండా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత పవన్‌తో చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు సంగీతం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఉగాది సందర్బంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ట్రైలర్‌తోనే రికార్డులు సృష్టిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

READ ALSO: Health News: భోజనం తర్వాత మీకు “స్వీట్స్” తినాలని అనిపిస్తోందా.? అయితే, ఇదే కారణం కావచ్చు..