Reading Time: < 1 minute
Vijay Deverakonda To Collab With Hi Nanna Director Shouryuv For A Mythological Project

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ప్రస్తుతం రౌడీ జనార్ధన, రణబాలీ వంటి వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్న విజయ్ ఇప్పుడు ‘హాయ్ నాన్న’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యువ దర్శకుడు శౌర్యువ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read : Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. ఈసారైనా హిట్టు వచ్చేనా?

శౌర్యువ్ సిద్ధం చేసిన ఈ కథలో ‘మైథాలజికల్’  అంశాలు మిళితమై ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినికిడి. పౌరాణిక టచ్‌తో కూడిన ఒక వినూత్నమైన సోషియో-ఫాంటసీ లేదా యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇమేజ్‌కు భిన్నంగా, ఒక సరికొత్త కథాంశంతో ఈ స్క్రిప్ట్ ఉండటం వల్లే రౌడీ స్టార్ దీనిపై ఆసక్తి చూపుతున్నట్లు టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రాలైన రణబలి’ మరియు ‘రౌడీ జనార్ధన’  షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది చివర్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అన్నీ కుదిరితే, శౌర్యువ్‌తో చేసే ఈ కొత్త ప్రాజెక్ట్‌ను వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడితే విజయ్ ఫ్యాన్స్‌కు ఇది అతిపెద్ద సర్ ప్రైజ్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. సెకండ్ సినిమాతో విజయ్ తో సినిమా ఛాన్స్ కొట్టిన శౌర్యువ్‌ ఎలాంటి హిట్ ఇస్తాడో రాబౌయే రోజుల్లో తెలుస్తుంది.