July 11, 2026

RaashiiKhanna : ‘తెలుసుకదా’ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలుసు.. కానీ నా మాట ఎవరు వినలేదు

RaashiiKhanna : ‘తెలుసుకదా’ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలుసు.. కానీ నా మాట ఎవరు వినలేదు
Reading Time: < 1 minute
Raashii Khanna Candid Comments On Telusu Kada Movie Trusting Instincts Over Directors Vision

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. తన తాజా చిత్రం తెలుసు కదా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాల గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ముఖ్యంగా సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో తనకున్న అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.

Also Read : OTT Movies : ఈ వీకెండ్ డిజిటల్ తెరపై సినీ జాతర

 రాశికన్నా మాట్లాడుతూ “నేను ‘తెలుసుకదా’ సెట్స్‌లో ఉన్నప్పుడు ఆ సినిమా గురించి ఎక్కడో కొంచం డౌట్ ఉండేది. ఇది సరిగ్గా వర్కవుట్ కాదేమో అని టీమ్ లో చాలా మందికి డైరెక్ట్ గా చెప్పాను. కానీ, దర్శకురాలి విజన్ మీద గౌరవంతో  ఆమె చెప్పినట్లుగా  చేసుకుంటూ వెళ్లాను. అయితే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తన మనసు చెప్పిన మాటే సరైనదని అనిపిస్తుంది. ఇప్పుడు ఆలోచిస్తే ఆ సమయంలో నా అంతరాత్మ చెప్పిన మాటనే నమ్మి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. కొన్నిసార్లు మనకు అనిపించేది కరెక్ట్ అవుతుంది, ఆ విషయంలో నేను నా నిర్ణయాన్ని మరింత బలంగా చెప్పి ఉండాల్సింది” అని వెల్లడించింది. సాధారణంగా నటీనటులు సినిమా విడుదలయ్యాక దర్శకులను పూర్తిగా సమర్థిస్తారు. కానీ రాశీ ఖన్నా ఇలా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని పంచుకోవడం సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. నీరజ కోన డైరెక్షన్ లో వచ్చిన తెలుసుకదా ప్లాప్ టాక్ తెచ్చుకుని సిద్దు కెరీర్ లో మరొక డిజాస్టర్ గా మిగిలింది.