Reading Time: < 1 minute
Ustaad Bhagat Singh Trailer Pawan Kalyan Harish Shankar Mass Entertainment

Ustaad Bhagat Singh Trailer: ఈ ఉగాదికి బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘మాస్ జాతర’ మొదలుకానుంది. పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ ఫిల్మ్ “ఉస్తాద్ భగత్ సింగ్” ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకగా, ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్‌ను కట్ చేశారు మేకర్స్. హరీష్ శంకర్ తన మార్క్ యాక్షన్, ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్‌ను ఎనర్జిటిక్ గా రూపొందించారు.

READ ALSO: Cockroach: బాబోయ్ ఇవి బొద్దింకలు కావు.. కొత్త తరం గూఢాచారులు!

పవన్ కళ్యాణ్ నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్న పదునైన డైలాగులు, బాడీ లాంగ్వేజ్ ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. శ్రీలీలతో పవన్ కెమిస్ట్రీ ఆకట్టుకోగా, రాశి ఖన్నా పాత్ర కూడా ప్రాధాన్యత ఉన్నట్టు కనిపిస్తోంది. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు పెద్ద అసెట్ అని చెప్పాలి. అలాగే ఈ ట్రైలర్‌లో పవన్ పలికిన అదిరిపోయే డైలాగ్స్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్ కూడా ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. వాడు నీకు భయపడలేదా.. ఎవరికీ భయపడలేదా?, ఇచ్చిపడేసే గోత్రం .. ఇరగదీసే నక్షత్రం.. లాంటి డైలాగ్స్ ఆడియన్స్‌కు మంచి హైప్ ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ అండ్ మేనరిజమ్స్‌తో ఆకట్టుకుంది. ఈ ఉగాదికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ హవా క్లియర్ గా కనిపిస్తోంది.

READ ALSO: Durandhar 2: ధురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం