Reading Time: < 1 minute
Moradabad Man Kills Twin Sister Attacks Mother Breakup Case

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు తన కవల సోదరిని కత్తితో 40 సార్లకు పైగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తన తల్లిని కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.

అసలేం జరిగింది..?
హార్దిక్, హింశిక అనే కవలలు (25 ఏళ్లు) గురుగ్రామ్‌లో పని చేస్తున్నారు. హోలీ పండుగ కోసం వారు తమ తల్లి నీలిమ వద్దకు మొరాదాబాద్ వచ్చారు. శుక్రవారం తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతుండగా ఈ దారుణం జరిగింది.

Also Read:Subsidy: టీ కొట్టు, హోటల్ యజమానులకు శుభవార్త.. దానిపై రూ.2 తగ్గింపు..

దాడి ఎలా జరిగింది..?
తల్లి ఆఫీస్‌కు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న హార్దిక్, తన సోదరి హింశికపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత.. ఏదో ఒక కారణం చెప్పి ఆఫీసులో ఉన్న తల్లిని ఇంటికి పిలిపించాడు. ఇంటికి రాగానే తల్లిని కూడా కత్తితో పొడిచి.. కారులో అక్కడి నుంచి పారిపోయాడు.

తల్లి కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి.. వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే హింశిక చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. హింశిక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కత్తి పోట్లు 40 సార్లు ఉన్నట్లు తెలిపారు.  గాయపడిన తల్లి ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

Also Read:SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..

ఎందుకు ఇలా చేశాడు..?
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఏడు నెలల క్రితం వారి మధ్య బ్రేకప్ అయ్యింది. అప్పటి నుంచి హార్దిక్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. తన ప్రేమ విఫలం కావడానికి తన తల్లి, సోదరే కారణమని నమ్మి… వారిపై కోపం పెంచుకున్నాడు. అంతే కాకుండా.. కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని పదే పదే చెప్పడం తనకు ఇబ్బంది కలిగించిందని అతడు పోలీసుల విచారణలో తెలిపాడు. ఆ కోపంలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు.