Reading Time: < 1 minute
Devara 2 Update Will Ntr Start Koratala Sivas Sequel After Dragon Big Reveal On May 20

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని అనుకుంటే.. ప్రశాంత్ నీల్ మాత్రం తాను అనుకున్న అవుట్ పుట్ వచ్చే వరకు ఎక్కడా కాంప్రమైజ్ అవడం లేదు. అందుకే.. ఈ ప్రాజెక్ట్ కాస్త డిలే అవుతు వస్తోంది. ఇదే ఏడాది జూన్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ.. అనుకున్న సమయానికి రావడం కష్టమే. దీంతో.. ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మరింత లేట్ అవుతోంది. నిజానికి, డ్రాగన్ తర్వాత దేవర 2 చేయడానికి రెడీ అవుతున్నాడు తారక్. కానీ, త్రివిక్రమ్‌తో ఓ మైథలాజికల్ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. అలాగే.. నెల్సన్ దిలీప్ కుమార్, వెట్రిమారన్ లాంటి తమిళ దర్శకులు కూడా లైన్‌లో ఉన్నారు.

Also Read: Ustaad Bhagat Singh: అఫీషియల్.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్!

మరి డ్రాగన్ తర్వాత టైగర్ ప్రాజెక్ట్ ఏంటి? అంటే, క్లారిటీ లేకుండా పోయింది. కానీ, దాదాపుగా దేవర 2నే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, దేవర తర్వాత మరో ప్రాజెక్ట్ చేయకుండా ‘దేవర 2’ కోసమే వర్క్ చేస్తున్నాడు కొరటాల శివ. మొదటి భాగానికి వచ్చిన మిక్స్డ్ టాక్‌ను దృష్టిలో పెట్టుకొని.. సీక్వెల్‌ను అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, అత్యంత పవర్‌ఫుల్ సన్నివేశాలను ఇందులో పొందుపరిచారని టాక్. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రను మరింత ఇంటెన్స్‌గా చూపించేలా కొరటాల శివ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, దేవర 2 ఎప్పుడు ఉంటుంది? అనౌన్స్మెంట్ ఎప్పుడు? లాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే, మే 20 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సీక్వెల్ ప్రకటన ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు తారక్ ఫ్యాన్స్. మరి టైగర్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.

Also Read: NTR-Neel: ఎన్టీఆర్ అలా, రుక్మిణి ఇలా.. వర్కౌట్ అవుతుందా?