Reading Time: < 1 minute
Ustaad Bhagat Singh Pre Release Event Fixed Pawan Kalyan To Ignite Yousufguda On March 15

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్, గ్లింప్స్ అంచనాలు పెంచేయగా.. ఈరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ముందు నుంచి చెప్పినట్టుగా.. ఉస్తాద్ ప్రీ-రిలీజ్ వేడుకను మార్చి 15న, అంటే ఈ ఆదివారం నాడు గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది.

Also Read:  Tamannaah: షాకింగ్.. తమన్నా బుగ్గపై అభిమాని ముద్దు, తర్వాత ఏం జరిగిందంటే?

ఇప్పటికే దీనికి సంబంధించిన అనుమతులు మరియు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. ‘ఓజి’ ఈవెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న మరో అతిపెద్ద సినిమా ఫంక్షన్ ఇదే కావడంతో అభిమానులు దీనికోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ స్పీచ్ ఎలా ఉంటుందా? అనే ఆసక్తి అందరిలోను ఉంది. ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్‌తో పాటు చిత్రబృందం మొత్తం హాజరుకానున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, తమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మరి మార్చి 19న థియేటర్లోరి రానున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read: Kayadu Lohar: కాయదు కమిటెడా? నమ్మలేని కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ!