Reading Time: < 1 minute
Suzuki Burgman Street Ex Gets New Pearl Grace White Colour In India

Suzuki Burgman Street EX: మార్కెట్‌ లో సుజుకి (Suzuki Motorcycle India) నుండి ఉన్న సుజుకి బుర్గ్మాన్ స్ట్రీట్ EX (Suzuki Burgman Street EX) స్కూటర్‌కు కొత్త కలర్ ఆప్షన్‌ ను పరిచయం చేసింది. ఈ అప్డేట్‌లో భాగంగా కొత్త పర్ల్ గ్రేస్ వైట్ పెయింట్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెర్షన్ లో తెలుపు, గ్రే రంగుల కలయిక ఉంటుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మెటాలిక్ రాయల్ బ్రాంజ్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నం.2 రంగులతో పాటు ఈ కొత్త కలర్ కూడా చేరింది.

Gold and Silver Price: పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర.. వెండిది అదే దారి..

బుర్గ్మాన్ స్ట్రీట్ EX స్కూటర్‌ లో సౌకర్యం, కంఫర్ట్‌ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో సుజుకి రైడ్ కనెక్ట్ తో ఉన్న బ్లూటూత్ సపోర్ట్ మల్టీఫంక్షన్, డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ ప్యానల్, LED హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, విండ్స్‌ క్రీన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా సీటు క్రింద 21.5 లీటర్ల స్టోరేజ్ స్పేస్ అందించారు. డ్యూయల్ టోన్ సీటుతో పాటు, పొడవైన ప్రయాణాల్లో కూడా సౌకర్యంగా ఉండేలా ఎక్స్‌టెండెడ్ రైడింగ్ పొజిషన్‌ను ఇచ్చారు. అలాగే 100/80-12 టైర్‌తో కూడిన 12 అంగుళాల రియర్ వీల్‌ను అందించారు.

Iran War: అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి..

మెకానికల్ పరంగా ఈ స్కూటర్‌ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇది 124cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 8.58 BHP పవర్, 10nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే మెరుగైన పనితీరు, ఇంధన సామర్థ్యం కోసం సుజుకి కో పెర్ఫార్మన్స్ ఆల్ఫా (SEP-alpha) టెక్నాలజీని ఉపయోగించారు. ఇక ఫీచర్లలో ఇంజిన్ ఆటో స్టాప్-స్టార్ట్, సుజుకి ఈజీ స్టార్ట్, అలాగే శబ్దం తక్కువగా ఉండే సైలెంట్ స్టార్టర్ కూడా ఉన్నాయి. ఇన్ని ఫీచర్లతో ఉన్న ఈ స్కూటర్ ధర రూ.1,07,902 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.