Reading Time: < 1 minute
Brad Haddin Calls Abhishek Sharma A Rascal After Match Winning Knock In T20 World Cup 2026 Final

Brad Haddin: ముగిసిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ తన ఫామ్‌పై పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫైనల్‌ కు ముందు జరిగిన ఏడు మ్యాచ్‌ లలో అతను కేవలం 89 పరుగులే చేశాడు. ఇందులో గ్రూప్ దశలో వరుసగా మూడు సార్లు డక్‌ గా అవుట్ అయ్యి.. అవసరంలేని రికార్డ్ ను మూటగట్టుకున్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌ లో మాత్రం అభిషేక్ శర్మ తన నుండి రావాల్సిన ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడేసాడు. ఈ నేపథ్యంలో కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు భారీ స్కోరు అందించడంతో పాటు టోర్నీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

Sourav Ganguly: “ముందుంది ముసళ్ల పండుగ”.. విక్టరీ జోష్‌లో ఉన్న కోచ్‌ గంభీర్‌కు గంగూలీ హెచ్చరికలు..

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ బ్రాడ్ హాడిన్ అభిషేక్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద మ్యాచ్‌ ల్లో అభిషేక్ అద్భుతంగా ఆడతాడని, సరదాగా అతన్ని “రాస్కల్” అని కూడా వ్యాఖ్యానించాడు. ఇంకా నాకు అభిషేక్ శర్మ అంటే చాలా ఇష్టమన్నారు. టోర్నీలో అతని స్థానంపై చాలా చర్చ జరిగింది. గ్రూప్ మ్యాచ్‌ ల్లో వరుసగా కొన్ని డ క్‌లు రావడంతో అతను ఒత్తిడిలో ఉన్నాడని అనిపించింది. కానీ, పెద్ద మ్యాచ్‌ ల్లో ఇలాంటి ఆటగాళ్లే అవసరమని.. వారు ఒత్తిడిని ఎదుర్కొని ప్రత్యర్థిపై ఒత్తిడి పెడతారని ఆయన తన భావనని వ్యక్త పరిచారు. ఫైనల్‌లో అతను ఆడిన తీరు మ్యాచ్‌ ను భారత్ వైపు తిప్పిందని హాడిన్ ఓ క్రికెట్ పోడ్‌ కాస్ట్ లో అన్నారు.

US Big Bounty: ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 92 కోట్ల ఫ్రైజ్ మనీ, అమెరికాలో స్థిరనివాసం..

అలాగే హాడిన్ న్యూజిలాండ్ జట్టును కూడా ప్రశంసించాడు. ఫైనల్‌కు చేరుకోవడం గొప్ప విషయమని అంటూనే.. కీలక సమయంలో మాత్రం వారు తడబడతారని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ మరోసారి ఫైనల్‌కు చేరుకోవడం మంచి విషయం. ఫిన్ అలెన్, టిమ్ సెఫట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. టోర్నీలో ప్రతిదీ వారి వైపే ఉందనిపించింది. కానీ చివరి అడ్డంకిని దాటలేకపోయారని.. చివరికి మెరుగైన జట్టే గెలిచిందంటూ బ్రాడ్ హాడిన్ అన్నారు.