July 10, 2026

Kim jong un: ఓ వైపు ఇరాన్ యుద్ధం.. ఏకంగా 10 బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించిన కిమ్..

Kim jong un: ఓ వైపు ఇరాన్ యుద్ధం.. ఏకంగా 10 బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించిన కిమ్..
Reading Time: < 1 minute
North Korea 10 Ballistic Missiles Kim Jong Un Freedom Shield Drills

Kim jong un: గత 15 రోజులుగా మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌లు దాడులు చేస్తు్న్నాయి. ప్రతీకారంగా ఇరాన్, ఇజ్రాయిల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తులపై దాడులు నిర్వహిస్తోంది. ఇదే కాకుండా గల్ఫ్ లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఖతార్‌లోని ఆయిల్, గ్యాస్ సంస్థలపై దాడులు చేస్తోంది.

Read Also: Iran: భారత్‌ను అమెరికా వేడుకుంటోంది.. ఇరాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు..

ఓవైపు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు జరుగుతుంటే, ఉత్తర కొరియా కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. శనివారం, ఉత్తర కొరియా తూర్పు తీరం నుంచి సముద్రం వైపు క్షిపణులు ప్రయోగించింది. ఉత్తర కొరియా 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయని దక్షిణ కొరియా సైన్యం, జపాన్ ప్రభుత్వం ధృవీకరించాయి. దీనికి ముందు, జనవరి 27న, ఉత్తర కొరియా తూర్పు సముద్రం వైపు అనేక స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

ఉత్తర కొరియా బాలిస్టిక్ ప్రొజెక్టైల్స్‌ను ప్రయోగించినట్లు గుర్తించామని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. జపాన్ ప్రభుత్వం కూడా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు ప్రకటించింది. ఇది బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు కావచ్చని తెలిపింది. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులు సముద్రంలో పడిపోయినట్లు జపనీస్ కోస్ట్ గార్డ్ నివేదించింది. దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్ వారి వార్షిక సైనిక విన్యాసాలు ‘ఫ్రీడమ్ షీల్డ్’ నిర్వహిస్తున్న సమయంలో ఉత్తర కొరియా చేసిన ఈ తాజా పరీక్ష జరిగింది.