Reading Time: < 1 minute
Egg Prices Drop In India Due To Gulf Export Disruptions Amid Middle East Conflict

Egg Prices Drop: మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు ఇప్పుడు భారత్‌లోని గుడ్ల ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.. ఉద్రిక్త పరిస్థితులతో భారతదేశం మరియు గల్ఫ్ దేశాల మధ్య దిగుమతులు, ఎగుమతులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీని కారణంగా బియ్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, చమురు, గ్యాస్ మరియు ముఖ్యంగా గుడ్ల ఎగుమతులు సడలిపోయాయి.

గల్ఫ్ మార్కెట్లలో గుడ్ల ఎగుమతులకు అంతరాయం ఏర్పడడంతో, భారతదేశంలో గుడ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. బెంగళూరులో హోల్‌సేల్ గుడ్ల ధరలు గుడ్డుకు రూ.7 నుండి రూ.5కి పడిపోయాయి. 100 గుడ్లను హోల్‌సేల్‌లో దాదాపు రూ.500కి కొనుగోలు చేయవచ్చు. రిటైల్ ధరలు కూడా రూ.5.50–రూ.6 మధ్య కొనసాగుతున్నాయి, ఇది గతంలో రూ.8–రూ.9 ఉండేది. భద్రతా సమస్యలు, రవాణా మార్గాల్లో అంతరాయాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్ వంటి దేశాలతో వాణిజ్య నిలిపివేతలు భారత ఎగుమతులపై ప్రభావం చూపాయి. దీంతో గల్ఫ్ దేశాలకు ఎగుమతి కోసం ఉద్దేశించిన గుడ్లు దేశీయ మార్కెట్లకు మళ్లించబడ్డాయి, అధిక సరఫరా ఏర్పడింది.

పరిశ్రమ అంచనాల ప్రకారం, యుద్ధం మొదలు కాక ముందుకు భారతదేశం రోజుకు సుమారు 10 మిలియన్ గుడ్లను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసేది. ఈ ఎగుమతులు నిలిపివేయడంతో, మార్కెట్లో అదనపు సరఫరా కారణంగా ధరలు క్షీణించాయి. ఈ తగ్గుదల కారణంగా, వినియోగదారుల డిమాండ్ పెరిగింది. ఎక్కువ ధరల కారణంగా గుడ్ల వినియోగాన్ని తగ్గించిన కుటుంబాలు ఇప్పుడు అందుబాటులో ఉన్న సరసమైన ధరలతో గుడ్లను కొనుగోలు చేస్తున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, 100 గ్రాముల గుడ్లలో సుమారు 155 కేలరీలు మరియు 12.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఇది సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉంటుంది.