Reading Time: < 1 minute
Jason Sanjay Drops Father Vijay Name Adds Mother Sangeetha In His Name Amid Family Controversy

Jason Sanjay: తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ కుటుంబానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. హీరో విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని (తమిళగ వెట్రి కళగం- TVK)తో అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టగా.. ఇప్పుడు ఆయన కుమారుడు జాసన్ సంజయ్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

Kondigari Ramulu: నిజాయితీకి మారుపేరు! మాజీ ఎమ్మెల్యే కొండి గారి రాములు కన్నుమూత..

తమిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు కోలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ గా మారాయి. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ త్వరలో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తన తాజా ప్రాజెక్ట్ క్రెడిట్స్‌లో, ఇంకా సోషల్ మీడియా హ్యాండిల్స్‌ లో ఆయన తన పేరును మార్చుకున్నారు.

సాధారణంగా జాసన్ తన పేరును ‘జాసన్ సంజయ్ విజయ్’ అని పిలిపించుకునేవారు. కానీ ఇప్పుడు తన పేరు నుంచి తండ్రి పేరును తొలగించి, తల్లి పేరును చేరుస్తూ ‘జాసన్ సంజయ్ సంగీత’గా మార్చుకున్నట్లు సమాచారం. తన తండ్రి కంటే తల్లికే ప్రాధాన్యత ఇస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం విజయ్ అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది.

Stock Market: చమురు ధరల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

విజయ్, ఆయన భార్య సంగీత మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ మరొక నటితో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపిస్తూ, సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయయించింది. ఆ తర్వాత విజయ్ నటి త్రిషతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు ఈ వివాదానికి మరింత బలం చేకూర్చాయి. దీనితో తన తల్లి పడుతున్న వేదనను చూసి, ఆమెకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే జాసన్ సంజయ్ తన తండ్రి పేరును పక్కన పెట్టినట్లు సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయి.