Reading Time: 2 minutes
Inspiring Story Daily Wage Worker Son Subramaniya Bharathi Clears Upsc Civil Services Examination In First Attempt

Subramaniya Bharathi: ఎన్నో కష్టాలు ఎదురుకొని గొప్ప విజయం సాధించాలంటే అంతసులువు ఏమి కాదు.. ఎంత కష్టపడేతత్వం ఉన్నా సరైన సహకారం లేక ఎందరో మహానుభావులు ఎదగలేకపోయారు. అయితే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే లక్ష్యంవైపు గట్టిగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏది లేదంటూ రుజువు చేశాడు ఓ రోజువారీ కూలి వ్యక్తి కుమారుడు. కలలను నిజం చేస్తూ చెన్నైకి చెందిన “సుబ్రమణియా భారతి” (Subramaniya Bharathi) మొదటి ప్రయత్నంలోనే ప్రతిష్ఠాత్మకమైన UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలలో విజయాన్ని అందుకున్నాడు.

Ring Roads In Telangana: తెలంగాణ జిల్లాలకు మహర్దశ.. ప్రతీ జిల్లాకో రింగు రోడ్డు..

ఇటుక తయారీ యూనిట్‌లో రోజువారీ కూలీగా పనిచేసే తండ్రి కుమారుడైన అతని విజయగాథ ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. అతి సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన భారతి విజయం వెనుక కఠినమైన శ్రమతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కీలక పాత్ర పోషించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న “నాన్ ముదల్వన్ స్కీం” (Naan Mudhalvan Scheme) కూడా అతని విజయానికి దోహదం చేసింది.

ఈ పథకం ద్వారా విద్యార్థులకు మార్గదర్శనం, నైపుణ్య శిక్షణ, కెరీర్‌కు సంబంధించిన సహాయం అందుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ప్రత్యేక మెంటరింగ్, అధ్యయన వనరులు అందించడంతో భారతి తన మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నాడు. ఫలితాలు వచ్చిన తర్వాత తన అనుభవాన్ని పంచుకున్న భారతి, ఈ ప్రయాణం అద్భుతంగా అనిపించిందని.. “ఇది నా మొదటి ప్రయత్నం. నాన్ ముధల్వన్ పథకం అందించిన సహాయంతోనే నేను మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించగలిగానన్నాడు. ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం, అలాగే కోచింగ్ సెంటర్ నా సన్నద్ధతలో ఎంతో కీలకంగా నిలిచాయని తెలిపారు.

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్’పై మైఖేల్ జాక్సన్ కొరియోగ్రాఫర్ ప్రశంసలు

భారతి మాట్లాడుతూ.. తాను కేవలం 18 ఏళ్ల వయస్సులోనే సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా ఈ ప్రయాణాన్ని ప్రారంభించానని వెల్లడించాడు. ఆ సమయంలో తనకు మార్గదర్శనం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, తల్లిదండ్రులే తనకు ప్రధాన ప్రేరణగా నిలిచారని చెప్పారు. నా తల్లి, తండ్రే నా మొదటి ప్రేరణ. వారు ఎప్పుడూ దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని నన్ను ప్రోత్సహించారని అన్నారు. భారతి దృష్టిలో సివిల్ సర్వీసెస్ అనేది కేవలం ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగం మాత్రమే కాదని.. సమాజంలోని సాధారణ ప్రజల సమస్యలను పరిష్కరించి, పేద వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఇది ఉత్తమ వేదిక అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.